యూఐడీఏఐ ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో పాలి వినైల్ కార్డు రూపంలో భారత పౌరులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. మీ పాకెట్లో ఇమిడి పోయే పాన్ కార్డు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత.
గత సంవత్సరం వరకు పాలీ వినైల్ క్లోరైడ్ (పివిసి) కార్డుపై ఆధార్ కార్డు ముద్రణ చెల్లదు, కాని ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పివిసి కార్డుపై ఆధార్ కార్డు ముద్రించడాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. యూఐడీఏఐ ఆధార్ కార్డును ఏటీఎం కార్డు సైజులో పాలి వినైల్ కార్డు రూపంలో భారత పౌరులకు అందుబాటులోకి తీసుకోచ్చింది.
మీ పాకెట్లో ఇమిడి పోయే పాన్ కార్డు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత. ఈ కార్డును పొందటానికి రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో పని లేదని, ఓటీపీ కోసం ఏ మొబైల్ నెంబర్‌నైనా వాడవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది.
ఈ కార్డు పొందటానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డ్ వెబ్‌సైట్ నుండి మీ కోసం అలాగే మొత్తం కుటుంబం కోసం పివిసి ఆధార్ కార్డును ఆర్డర్ చేయవచ్చు.
వీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
పివిసి ఆధార్ కార్డు ఎటిఎం కార్డు సైజులో ఉంటుంది. నీటితో పడిపోయిన లేదా విరిగిపోయే భయం ఉండదు. అంతే కాకుండా, కొత్త పివిసి ఆధార్ కార్డులో అనేక కొత్త భద్రతా లక్షణాలు అందించారు.
also read ఇండియాలో దీపావళి అమ్మకాలు 72వేల కోట్లు.. చైనాకు భారీ నష్టం : సిఐఐటి ...
పివిసి కార్డుపై ఆధార్ ప్రింట్ ఆర్డర్ చేయడానికి మీరు కేవలం 50 రూపాయలు మాత్రమే చెల్లించాలి. మీ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉంటే, మీరు రూ.250 చెల్లించాలి.
పివిసి ఆధార్ కార్డును ఆర్డర్ చేయడానికి మొదట https://residentpvc.uidai.gov.in/order-pvcreprint లింక్‌పై క్లిక్ చేయండి. తరువాత 'మై ఆధార్' అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు అర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశాక 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి, మీ స్క్రీన్‌పై కనిపించే భద్రతా కోడ్‌ను కూడా నమోదు చేయండి.
సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డు లింకు చేయబడిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక పేమెంట్ కోసం మీరు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా రూ.50 చెల్లించాలి.
మీ కొత్త పీవీసీ ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్‌లో కొన్ని రోజుల్లో మీ ఇంటికే వస్తుంది. మీరు పివిసి ఆధార్ కార్డు రశీదును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అందులో ఇచ్చిన 28-అంకెల సర్వీస్ రీక్వేస్ట్ నంబరుతో స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
