Asianet News TeluguAsianet News Telugu

అనిల్ అంబానీపై దివాలా కేసు.. నేడు తీర్పును ప్రకటించిన ఎన్‌సిఎల్‌టి..

అనిల్ అంబానీపై దివాలా కేసు పెట్టడానికి ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. అనిల్ అంబానీ తన హామీ మేరకు ఆర్‌కాం కోసం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నుండి సుమారు 1,200 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు.

NCLT allows bankruptcy proceedings against Anil Ambani over  debt to SBI
Author
Hyderabad, First Published Aug 21, 2020, 8:29 PM IST

రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ ఆర్‌కాం రుణాలు తీసుకున్న కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ ఈ రోజు తన తీర్పును ప్రకటించింది.

అనిల్ అంబానీపై దివాలా కేసు పెట్టడానికి ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. అనిల్ అంబానీ తన హామీ మేరకు ఆర్‌కాం కోసం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నుండి సుమారు 1,200 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు.

ఈ కేసులో ఎస్‌బిఐ అభ్యర్ధనపై ఎన్‌సిఎల్‌టి తన నిర్ణయాన్ని జూన్ 30న రిజర్వు చేసింది. ఈ ఉత్తర్వును జ్యుడిషియల్ సభ్యుడు మహ్మద్ అజ్మల్, రవికుమార్ అనే డివిజన్ బెంచ్ రెండు వైపులా వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వు చేసింది. 

also read రైల్వే శాఖపై కేంద్రం మరో కీలక నిర్ణయం.. అమ్మకానికి ఐఆర్‌సీటీసీ షేర్లు.. ...

అనిల్ అంబానీ యాజమాన్యంలోని ఆస్తులను అంచనా వేయడానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పి) ను నియమించాలని బోర్డును ఆదేశిస్తూ ఐపిసి లోని సెక్షన్ 97 (3) కింద ఎస్‌బిఐ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కు ఇచ్చిన రుణాలకు అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ రుణాన్ని తీర్చడానికి ఒక ప్రణాళికను సమర్పించింది.

సమాచారం ప్రకారం, ఆగస్టు 2016 న ఎస్‌బి‌ఐ క్రెడిట్ సౌకర్యం కింద రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 1,200 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చింది. 2016 సెప్టెంబర్లో అనిల్ అంబానీ ఈ క్రెడిట్ సదుపాయానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు.

 జనవరి 2017లో రుణ ఖాతాలు డిఫాల్ట్ అయ్యాయి. జనవరి 2018లో ఎస్‌బి‌ఐ బ్యాంక్ అనిల్ అంబానీ వ్యక్తిగత హామీని రద్దు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios