Asianet News TeluguAsianet News Telugu

ఐస్ క్రీం షాపులో కూతురితో ఇన్ఫోసిస్ ఫౌండర్.. సాధారణ దుస్తుల్లో కెమెరాకి ఫోజులు..

బెంగళూరులోని జయనగర్‌లో ఉన్న ఐకానిక్ కార్నర్ హౌస్‌లో నారాయణ మూర్తితో కలిసి అక్షతా మూర్తి ఐస్‌క్రీం ఆస్వాదిస్తున్నారు. సాధారణ దుస్తులు ధరించి, తండ్రి-కూతురు ఇద్దరు చేతుల్లో ఐస్‌క్రీమ్ కప్పులతో ఫోటోకు పోజులిచ్చారు.
 

Narayana Murthy, Akshata Murty visit iconic Bengaluru ice cream joint-sak
Author
First Published Feb 13, 2024, 11:11 AM IST

UK ప్రథమ మహిళ అక్షతా మూర్తి బెంగళూరులో ఫ్యామిలీ టైం ఆస్వాదిస్తున్నారు. ఆమె తన తండ్రి అండ్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తితో కలిసి బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐస్ క్రీం పార్లర్ లో ఫోటోకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ  ఫోటోని  ఆదర్శ్ హెగ్డే అనే యూజర్ Xలో షేర్ చేశారు.

బెంగళూరులోని జయనగర్‌లో ఉన్న ఐకానిక్ కార్నర్ హౌస్‌లో నారాయణ మూర్తితో కలిసి అక్షతా మూర్తి ఐస్‌క్రీం ఆస్వాదిస్తున్నారు. సాధారణ దుస్తులు ధరించి, తండ్రి-కూతురు ఇద్దరు చేతుల్లో ఐస్‌క్రీమ్ కప్పులతో ఫోటోకు పోజులిచ్చారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 10న చిత్రా బెనర్జీ దివాకరుణి రచించిన "యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 

సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  నారాయణ మూర్తి దంపతులు మొదటిసారి ఎలా కలుసుకున్నారు అనే దాని గురించి మాట్లాడారు. ఈ జంట 1970ల ప్రారంభంలో కలుసుకున్నారు.  

"నేను తలుపు తట్టినప్పుడు, ఒక కాలేజీ స్టూరెంట్  డోర్ తెరిచారు: చిన్నగా, కళ్లద్దాలు, చాలా సీరియస్  అండ్ చాలా యంగ్. అతను ఎవరు అని నేను ఆశ్చర్యపోయాను?" అంటూ సుధ ప్రేక్షకులకు తెలిపారు.  

ఆ రోజు, నారాయణ మూర్తి సుధా కులకర్ణిని సమీపంలోని రెస్టారెంట్‌లో డిన్నర్ కి  అడిగారు, ఇక మిగిలినది చరిత్ర.

 దివాకరుణి పుస్తకం నారాయణ మూర్తి అండ్  సుధా మూర్తి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు వారి సంబంధాన్ని విశ్లేషిస్తుంది. 1977లో  నారాయణ మూర్తి తన మొదటి వెంచర్ అయిన సాఫ్ట్‌ట్రానిక్స్‌ను కొనసాగించడానికి కష్టపడుతున్నప్పుడు, అతను కంప్యూటర్ టైం  కోసం విలువైన నిమిషాల కోసం పూణే నుండి ముంబైకి ప్రతి కొద్దీ రోజులకు ప్రయాణించేవాడు. ఆ సమయంలో అతను కూడా సుమారు కొన్ని సంవత్సరాలు సుధను 'చూస్తుండే వాడు'. 

 

Follow Us:
Download App:
  • android
  • ios