రిటెన్ టెస్ట్ లేదు.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రూ.36 లక్షల జీతం
నాబార్డ్‌లో స్పెషలిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వీటికి రాత పరీక్ష లేదు. నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. సెలెక్ట్ అయితే రూ.36 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు మీరు అర్హులేమో ఒకసారి చెక్ చేసుకోండి.
గవర్నమెంట్ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా? అయితే ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. నాబార్డ్ (National Bank for Agriculture and Rural Development) ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. మంచి జీతంతో పాటు మీ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
నాబార్డ్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో కొన్ని ఉద్యోగాలకు ఏకంగా రూ.36 లక్షల వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ పొందాలంటే మీరు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం మీకు ఆ విభాగంలో అనుభవం, అర్హత ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 5 జనవరి 2025.
ఉద్యోగాలు ఎక్కడ?
నాబార్డ్ 10 స్పెషలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది.
- ETL డెవలపర్ - 1
- సీనియర్ బిజినెస్ అనలిస్ట్ - 1
- బిజినెస్ అనలిస్ట్ - 1
- UI/UX డెవలపర్ - 1
- స్పెషలిస్ట్ డేటా మేనేజ్‌మెంట్ - 1
- ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ మేనేజ్‌మెంట్) - 1
- సీనియర్ అనలిస్ట్ (నెట్‌వర్క్ మరియు సైబర్ సెక్యూరిటీ) - 1
- డేటా సైంటిస్ట్ - 2
దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీ
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21 డిసెంబర్ 2024
- చివరి తేదీ: 5 జనవరి 2025
- అధికారిక వెబ్‌సైట్: www.nabard.org
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
- కొన్ని ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
- మిగతా ఉద్యోగాలకు BE/B.Tech/M.Tech/MCA/MSW వంటి ఉన్నత డిగ్రీలు అవసరం.
దరఖాస్తు ఫీజు ఎంత?
- జనరల్: రూ.850
- SC/ST/PWBD: ఉచితం
జీతం ఎంత?
నాబార్డ్‌లో జీతం ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.
- ETL డెవలపర్ కి అయితే సంవత్సరానకి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు ఇస్తారు.
- సీనియర్ బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ కి సంవత్సరానికి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఇస్తారు.
- బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ కి ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షలు జీతంగా ఇస్తారు.
- UI/UX డెవలపర్ కి అయితే సంవత్సరానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు ఇస్తారు.
- స్పెషలిస్ట్ డేటా మేనేజ్‌మెంట్ పొజిషన్ కి ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తారు.
- డేటా సైంటిస్ట్ పొజిషన్ కి సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ. 24 లక్షలు ఇస్తారు.
- ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ మేనేజ్‌మెంట్) పొజిషన్ అయితే ఏడాదికి ఏకంగా రూ.36 లక్షలు ఇస్తారు.
- సీనియర్ అనలిస్ట్ (నెట్‌వర్క్, సైబర్ సెక్యూరిటీ) జాబ్ కి సంవత్సరానికి రూ.30 లక్షలు ఇస్తారు.
పూర్తి వివరాలకు..
- మీకు మరిన్ని వివరాలు కావాలంటే నాబార్డ్ వెబ్‌సైట్ www.nabard.orgలో పూర్తి సమాచారం చూడండి.
- మీకు పైన తెలిపిన అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.