ఆయన వయసు 72 సంవత్సరాలు. ముథూట్ ఫైనాన్స్ భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బి‌ఎఫ్‌సి) లో ఒకటి. 

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజి జార్జ్ ముథూట్ శుక్రవారం సాయంత్రం న్యూ ఢీల్లీలో కన్నుమూసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆయన వయసు 72 సంవత్సరాలు. ముథూట్ ఫైనాన్స్ భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బి‌ఎఫ్‌సి) లో ఒకటి. ముథూట్ గ్రూప్ కంపెనీకి ఆయన తన కుటుంబం నుండి మూడవ తరం చైర్మన్.

అతను ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి ధర్మకర్త అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐ‌సి‌సి‌ఐ) జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కూడా. యన ఫిక్కీ కేరళ స్టేట్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ రిచ్ లిస్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు మలయాళీలలో జార్జ్ ముథూట్ ఒకరు.

also read మీకు తెలుసా పెట్రోల్ బంకుల్లో ఈ 9 సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి.. లేదంటే వెంటనే ఫిర్యాదు చేయండి.. ...

ఎంజి జార్జ్ ముథూట్ నాయకత్వంలో ముథూట్ ఫైనాన్స్ భారీగా వృద్ధిని సాధించింది అలాగే గోల్డ్ లోన్ పరిశ్రమలో మార్కెట్ లీడర్ గా మారింది.ఎంజి జార్జ్ ముథూట్ ఆకస్మిక మరణం సంస్థ ఉద్యోగులు, స్టేక్ హోల్డర్లు, కుటుంబం, స్నేహితులకు తీరని లోటు. సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నాట్లు సంస్థ తెలిపింది.

1949 నవంబరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జార్జ్‌ ముత్తూట్‌ జన్మించారు. కుటుంబ వ్యాపారంలోకి ఆయన చిన్న వయస్సులోనే ప్రవేశించారు. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్‌ గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ ముత్తూట్‌ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది.

 దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. జార్జ్‌ ముత్తూట్‌ భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులున్నారు. దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్‌ ఫైనాన్స్‌కు 23 రాష్ట్రాల్లో 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలు ఊన్నాయి.

Scroll to load tweet…