ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పోస్ట్ కోవిడ్ -19 సంరక్షణ కోరుతూ ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చేసిన విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి చందా కొచ్చర్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసింది.

అరెస్టు చేసిన కొన్ని రోజుల తరువాత, అతనికి కరోనావైరస్ పాజిటివ్ రావటంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

also read డిజిటల్ పేమెంటులో రాబోతున్న పెద్ద మార్పులు, కొత్త నియమాలు ఏమిటంటే .. ...

అతను ఇటీవల కరోనా నుండి కోలుకున్న తరువాత జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అతన్ని నవీ ముంబైలోని తలోజా జైలులో ఉంచారు.

జైలులో కోవిడ్-19 సంరక్షణపై ఆందోళన చెందుతున్న అతని న్యాయవాది చందా కొచ్చర్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలని కోర్టును కోరారు.

అయితే ఆయన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పి రాజవైద్యా తిరస్కరించారు.

"వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1,875 కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.