భారత ఐటీ సెక్టార్ లోని దిగ్గజ కంపెనీలు మాత్రమే కాదు కొన్ని మిడ్ క్యాప్ కంపెనీలు సైతం మల్టీ బ్యాగర్లుగా అవతరిస్తుంటాయి. అలాంటి కోవకే వస్తుంది... Happiest Minds స్టాక్, ఈ షేర్ గడిచిన రెండేళ్లలో ఇనెస్టర్లకు కనక వర్షం కురిపించింది.
మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్లకు ఉన్నంత డిమాండ్ మరే స్టాక్ట్స్ కు ఉండదు. కొన్ని స్టాక్స్ పెద్దగా హడావిడి చేయకుండా సైలెంటుగా మల్టీ బ్యాగర్లుగా మారిపోతుంటాయి. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ (Happiest Minds) షేర్లు 2021లో మల్టీబ్యాగర్ స్టాక్ గా పేరొందిన వాటిలో ఒకటి. IT రంగానికి చెందిన ఈ స్టాక్ 2022 లో మాత్రం ప్రాఫిట్-బుకింగ్ మోడ్ లో ఉంది.
అయినప్పటికీ, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుండి దాని ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్ లను ఇస్తోంది. దీని పబ్లిక్ ఆఫర్ సెప్టెంబర్ 2020లో ఈక్విటీ షేర్ ప్రైస్ బ్యాండ్‌కి రూ. 165 - 166 రేంజులో జారీ చేయగా, హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO BSEలో రూ.351, NSEలో రూ. 350 వద్ద లిస్టింగ్ అవడంతో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది.
ఈ స్టాక్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పటి నుండి అద్భుతమైన రాబడిని ఇస్తూనే ఉంది. అంతే కాదు మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది.
గత శుక్రవారం, హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్ ఒక్కో షేరుకు రూ.1,222 (Happiest Minds Share Price) వద్ద ముగిసింది. ఈ విధంగా, ఈ స్టాక్ ఇష్యూ ధరను శుక్రవారం ధరతో పోల్చినట్లయితే, అది రూ. 575 పెరిగింది. ఒక ఇన్వెస్టర్ లిస్టింగ్ రోజున ఈ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు అతని పెట్టుబడి మూడు రెట్లు పెరిగిఉండేది. అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు ఇష్యూ ధర వద్ద ఒక లాట్ కొనుగోలు చేస్తే, అంటే రూ. 14,940 పెట్టుబడి పెట్టి, దానిని అలాగే ఉంచుకుంటే, ఈరోజు అతను రూ. 14,940ని రూ.1 లక్షగా మారి ఉండేది.
ఒక సంవత్సరంలో 115 శాతం జంప్
హ్యాపీయెస్ట్ మైండ్ (Happiest Minds Share Price) షేర్లు గత ఏడాది కాలంలో 115 శాతం లాభపడ్డాయి. ఈ కాలంలో కంపెనీ ఒక్క షేరు ధర రూ.522 నుంచి రూ.1122కి పెరిగింది. అయితే, గత 6 నెలలుగా, ఈ స్టాక్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. దీనికి కారణం ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. దీంతో షేరు ధర రూ.1422 నుంచి రూ.1122కి పడిపోయింది. ఈ విధంగా చూస్తే ఆరు నెలల్లో 21 శాతం పడిపోయింది. విశేషమేమిటంటే గత నెల రోజుల్లో షేరు ధర 15 శాతం ఎగబాకింది. రూ.975 నుంచి రూ.1121 స్థాయికి పెరిగింది.
IPO హిట్ అయింది
హ్యాపీయెస్ట్ మైండ్స్ IPO సెప్టెంబర్ 2020లో వచ్చింది. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ.165 నుంచి 166గా ఉంది. ఈ ఐపీఓ నుంచి రూ.702.02 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. సెప్టెంబర్ 17, 2020న, ఈ IPO బంపర్ ప్రీమియంలో జాబితా చేయబడింది. ప్రారంభ సమయానికి షేర్ ధరలు రెండింతలు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ఒక షేరు రూ.350గా, బీఎస్‌ఈలో రూ.351గా మారింది.
