స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్లను గుర్తించడం చాలా కష్టం, ఒక్కసారి మీ స్టాక్ మల్టీ బ్యాగర్ అయ్యిందంటే దాదాపు జాక్ పాట్ కొట్టినట్లే, అలాంటి స్టాక్స్ ను గుర్తించడం కష్టమే, కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్ కొన్ని సార్లు మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి స్టాక్ గురించి చూద్దాం. 

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురైనప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ మాత్రం 2021లో తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులను అందించింది. పెన్నీ స్టాక్‌లతో సహా పలు స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ఇన్వెస్టర్ల డబ్బను రెండింతలు చేసిన స్టాక్స్ ను మల్టీ బ్యాగర్లు అంటారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు 2022లో కూడా సెకండరీ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్లాక్స్ కోసం వెతుకుతున్నారు. అలాంటి ఇన్వెస్టర్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి. 

సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ షేర్లు (Salasar Techno)2022లో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసే అవకాశం ఉందని మార్కెట్ ప్లేయర్స్ చెబుతున్నారు. 2022 చివరి నాటికి సలాసర్ టెక్నో షేర్లు ( Salasar Techno)రూ.500 స్థాయిని తాకవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టాక్ సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 257.80 రూపాయల వద్ద ట్రేడయ్యింది. 

ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు (IIFL Securities) చెందిన అనుజ్ గుప్తా మాట్లాడుతూ సలాసర్ టెక్నో ఒక టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఎలక్ట్రిఫికేషన్, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల కోసం ఇంజనీరింగ్ సర్వీసులను ఈ సంస్థ అందిస్తుంది. త్వరలో దేశంలో 5Gని ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తే మాత్రం, కంపెనీ వ్యాపారం దీర్ఘకాలికంగా బలంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు, సంస్థ ఫండమెంటల్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. ఈ దృష్ట్యా ఈ స్టాక్‌పై మార్కెట్ చాలా బుల్లిష్‌గా ఉంది. అంతేకాదు కంపెనీ దేశంలోని టెలికాం ఇన్‌ఫ్రా రంగంలో విస్తరణ చేపడుతోంది. అంతేకాదు సింగిల్ విండోలో తన వినియోగదారులకు టెలికాం టవర్‌ల తయారీ, డిజైనింగ్, ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి సౌకర్యాలను అందిస్తుంది.

ఇక ప్రాఫిటబుల్ ఈక్విటీస్‌కి (Proficient Equities) చెందిన మనోజ్ దాల్మియా మాట్లాడుతూ, ఈ స్టాక్‌లో ఇప్పుడు ప్రాఫిట్-బుకింగ్ సాధ్యమే, కానీ ఇన్వెస్టర్లు కొంత కాలం వేచి ఉండాలని చెప్పారు. 210-240 మధ్య దాటిన తర్వాత, ఈ స్టాక్‌లో మంచి కొనుగోలు అవకాశం ఉంటుంది. స్వల్పకాలంలో, ఈ స్టాక్ రూ. 291 వరకు పెరగడం చూడవచ్చు.

ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు (IIFL Securities) చెందిన అనుజ్ గుప్తా మాట్లాడుతూ, టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్‌ను పరిశీలిస్తే, ఈ స్టాక్ దాదాపు రూ. 350 వద్ద రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. ఒకసారి ఈ అడ్డంకిని ఛేదించినట్లయితే, స్టాక్ రూ. 450-500 స్థాయిని తాకవచ్చు. ఈ స్థాయిని డిసెంబర్ 2022లో చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈ స్టాక్‌లో కొంత ప్రాఫిట్-బుకింగ్ చూడవచ్చని అంచనా వేశారు. అలాంటి పరిస్థితిలో, స్టాక్ ప్రస్తుత స్థాయి నుంచి రూ. 220 వరకూ కరెక్షన్ ద్వారా దిగివచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చని సూచించారు.