రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు, జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డుకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డు నాలుగు గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలను నిర్వహిస్తుంది అందులో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి అలాగే మరో 51 దేవాలయాలు ఉన్నాయి.

చార్ ధామ్ దేవస్థానం బోర్డు అదనపు సీఈఓ బీడీ సింగ్ సూచన మేరకు అనంత్ అంబానీ ఈ విరాళం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడం, మౌలిక సదుపాయాల మెరుగుదల, యాత్రికులకు సౌకర్యాలు పెంచడం కోసం బోర్డుకి సహాయం అందించాలని బీడీ సింగ్ అనంత్ అంబానీ అభ్యర్థించారు.

ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ డివిజన్ కమిషనర్, బోర్డు సీఈఓ రవినాథ్ రామన్ అంబానీ  విరాళానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయపడాలని దేవస్థాన బోర్డు అదనపు సీఈవో బీడీ సింగ్‌ అంబానీ కుటుంబానికి  విజ్ఞప్తి చేశారు.

also read పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు.. ...

చార్ ధామ్ యాత్రను జూన్ లో మాత్రమే దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి అనుమతించారు. కోవిడ్-19 లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఉత్తరాఖండ్‌లోని మత పర్యాటక రంగం, మత సంస్థల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి.

2019 మార్చిలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం  అనంత్ అంబానీ సంప్రదించిన తరువాత అంబానీ కుటుంబ అతి పిన్న వయసుడైన  అనంత్ అంబానీ  శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీలో భాగమయ్యారు. ఈ కుటుంబం గత ఏడాది కూడా రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చింది.

శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ కమిటీలో అనంత్ అంబానీ పాల్గొనడానికి ముందే ముఖేష్ అంబానీ 2018లో ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలను సందర్శించి తన కుమార్తె ఇషా అంబానీ వివాహ కార్డును దేవలయాలకి అందించారు. ఆ సమయంలో ఆలయ నిధులకు రూ.51 లక్షలు అందించినట్లు సమాచారం.