Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లోకి బిగ్‌బజార్‌.. 27వేల కోట్లకు కొనుగోలు..

బిగ్‌బజార్‌, ఫుడ్‌ధాల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే ఇప్పటికే రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు 12 వేల స్టోర్లు ఉన్నాయి. రిటైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్‌ అంబానీ ఫ్యూచర్‌ గ్రూపుపై కన్ను పడింది. 

Mukesh Ambani RIL may acquire Future Group's retail business big bazar for Rs 27,000 crore
Author
Hyderabad, First Published Jul 29, 2020, 11:21 AM IST

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కిషోర్ బియానీ చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రూ .24,000-27,000 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చర్చలు చివరి దశలో ఉన్నయని ఈ ఒప్పందం ద్వారా భారత రిటైల్ విభాగంలో ఆర్‌ఐఎల్ స్థానాన్నిమరింత పెంచుతుంది.

బిగ్‌బజార్‌, ఫుడ్‌ధాల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే ఇప్పటికే రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు 12 వేల స్టోర్లు ఉన్నాయి. రిటైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్‌ అంబానీ ఫ్యూచర్‌ గ్రూపుపై కన్ను పడింది.

దీనిని అనుసరించి, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (FEL) తన రిటైల్ ఆస్తులను ఆర్‌ఐ‌ఎల్  రిటైల్ అనుబంధ సంస్థలలో ఒకదానికి జూలై 31 వరకు ఒప్పందం కుదుర్చుకుంటుంది, ఈ ఒప్పందంపై సంతకం చేయవలసి ఉంటుంది. చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం ముగియడానికి సమయం పట్టవచ్చని కొన్ని రిపోర్టులు తెలిపాయి.

also read నాలుగు నెలల్లో 30వేల కోట్లు విత్‌డ్రా.. ...

బిగ్‌బజార్‌, ఫుడ్‌ధాల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే ఇప్పటికే రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు 12 వేల స్టోర్లు ఉన్నాయి. రిటైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్‌ అంబానీ ఫ్యూచర్‌ గ్రూపుపై కన్ను పడింది.

విదేశీ బ్రాండ్లు, రిటైలర్లతో ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యాన్ని కూడా ఆర్‌ఐ‌ఎల్  తీసుకోనుంది. ఉదాహరణకు, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ 7-ఎలెవెన్ ఇంక్ తో మాస్టర్ ఫ్రాంచైజ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఇప్పటివరకు ఏ స్టోర్లు తెరవలేదు, కానీ వ్యాపారం ఆర్‌ఐ‌ఎల్  చేతుల్లోనే ఉంటుంది.

ఫ్యూచర్ గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ అప్పులను ఎదురుకొంటుంది. సెప్టెంబర్ 30, 2019 నాటికి, ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ ఎంటిటీలలో రుణాలు మార్చి 31, 2019 నాటికి 10,951 కోట్ల రూపాయల నుండి 12,778 కోట్ల రూపాయలకు పెరిగాయని ఒక నివేదిక పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios