రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలో నాల్గవ ధనవంతుడిగా అవతరించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని నాల్గవ స్థానంలోకి ఎగబాకినట్లు చూపించింది.

ముఖేష్ అంబానీ కంటే ముందు స్థానంలో అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్‌ను చూపించే జాబితా ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్, వారెన్ బఫ్ఫెట్, స్టీవ్ బాల్‌మెర్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎలోన్ మస్క్ కంటే ముకేష్ అంబానీ ధనవంతుడుడిగా ఎదిగాడు.

జనవరి నుండి  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ముకేష్  అంబానీ పది స్థానాలను ఎగబాకాడు, ఎందుకంటే మార్చిలో  రిలయన్స్  షేర్లు 145% ఎదిగి రూ.867.82 కనిష్టంగా ఉన్నాయి.

also read భగభగమంటున్న బంగారం ధరలు.. సామాన్యుడికి భారంగా స్వర్ణం.. ...

అగ్ర స్థానంలో ఉన్న 5 బిలియనీర్లలో ముకేష్ అంబానీ ఉండాటానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎందుకంటే దశాబ్దాల నుండి ప్రపంచంలోని ఐదుగురు ధనవంతులలో అమెరికన్లు, ఒకటి లేదా ఇద్దరు యూరోపియన్లు, ఒక మెక్సికన్ ఆధిపత్యం కొనసాగించారు. ఇప్పుడు ఒక భారతీయుడు అందులో చోటు దక్కించుకోవడం విశేషం. 


జెఫ్ వెజోస్ సంపద 187బిలియన్లు, బిల్ గేట్స్  121 బిలియన్లు, మార్క్ జూకర్ బర్గ్  102 బిలియన్లు, ముకేష్ అంబానీ  80.6 బిలియన్లు, బెర్నార్డ్ అర్నాల్ట్  80.2 బిలియన్లు, వారెన్ బఫెట్     79.2బిలియన్లు, స్టీవ్ బల్మర్ 76.4 బిలియన్లు, లారీ పేజ్ 71.3బిలియన్లు, సెర్జీ బ్రిన్  69.1బిలియన్లు, ఎలాన్ మస్క్ 68.7బిలియన్లు

తరువాత స్థానంలో ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్, లారీ ఎల్లిసన్, మాకెంజీ స్కాట్, రాబ్ వాల్టన్, జిమ్ వాల్టన్, ఆలిస్ వాల్టన్, అమాన్సియో ఒర్టెగా, చార్లెస్ కోచ్, జూలియా ఫ్లెషర్ కోచ్, పోనీ మా, జాక్ మా, కార్లోస్ స్లిమ్, జాక్వెలిన్ మార్స్, జాన్ మార్స్, డాన్ గిల్బర్ట్ , ఫ్రాంకోయిస్ పినాల్ట్, ఫిల్ నైట్, మైఖేల్ డెల్, గియోవన్నీ ఫెర్రెరో, హుయ్ కా యాన్, లెన్ బ్లావాట్నిక్, లారెన్ పావెల్ జాబ్స్, కోలిన్ హువాంగ్, అలైన్ వర్థైమర్, గెరార్డ్ వర్థైమర్, అబ్బి జాన్సన్ మరియు మరిన్ని.