ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితా 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది ధనవంతులలో ముఖేష్ అంబానీ 88 బిలియన్ డాలర్ల సంపదతో తో మొదటి స్థానంలో నిలిచారు. ముకేష్ అంబానీ తరువాత 25 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ ఉన్నారు.

ముఖేష్ అంబానీ గత దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా ధనిక జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.  వరుసగా 13వ సంవత్సరం కూడా ముకేష్ అంబానీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం ముకేష్ అంబానీకి ఈ ఏడాది 37.5 బిలియన్ డాలర్ల సంపద అదనంగా తోడయ్యిందాని  ఫోర్బ్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా భారతదేశ ధనవంతులు వారి సంపదను కాపాడుకున్నారు." అని ఫోర్భ్స్‌ తెలిపింది. "ముఖేష్ అంబానీ వరుసగా 13 వ సంవత్సరం భారతీయ సంపన్నుడిగా నిలిచాడు, అతని సంపదకి ఈ యేడాది  37.3 బిలియన్ డాలర్లు తోదైంది.

also read ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డుకు అనంత్ అంబానీ భారీ విరాళం.. ...

వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనవల్లా 6వ ర్యాంక్‌తో టాప్ 10 స్థానాల్లోకి ప్రవేశించారు, ఎందుకంటే కరోనా వైరస్ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది.

బయోకాన్ సి‌ఈ‌ఓ కిరణ్ మజుందార్ షా కూడా అత్యధిక సంపద సంపాదించారు, ఫోర్బ్స్ జాబితాలో ఉన్న ఔషధ సంస్థల బిలియనీర్లు వారి సంపదలో ఈ యేడాది పెరుగుదలను చూశారు. 2019లో కంటే ఈ సంవత్సరం కొంత మంది బిలియనీర్ల సంపద క్షీణించడాన్ని చూశారు ”అని ఫోర్బ్స్ ఇండియా నివేదికలో తెలిపింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన డిజిటల్ యూనిట్ జియో ప్లాట్‌ఫామ్స్ అలాగే రిటైల్ ఆర్మ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వాటాల అమ్మకాల ద్వారా గత కొన్ని నెలలుగా రూ .1.65 ట్రిలియన్ (22.43 బిలియన్ డాలర్లు) డాలర్లు సమీకరించింది.

సెప్టెంబరులో రిలయన్స్ రిటైల్ విభాగంలో కెకెఆర్ & కో ఇంక్ నుండి 755.1 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది, దీనికి ప్రీ-మనీ వాల్యుయేషన్ రూ .4.21 ట్రిలియన్ (57.28 బిలియన్ డాలర్లు) ఇచ్చింది.