భారతదేశ అత్యంత సంపన్నుడు, బిలియనీర్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ హిందూ దేవాలయానికి 20 కేజీల బంగారాన్ని విరాళం ఇచ్చారు.

అస్సామ్ రాష్ట్రంలోని గౌహతిలో భారతదేశ శక్తి పిటాలలో ఒకటైన కామాఖ్యా ఆలయం ఈ దీపావళిలో బంగారంతో మేరవనుంది. కామాఖ్యా ప్రధాన ఆలయానికి పైన ఉన్న గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు.

ముఖేష్ అంబానీ కామాఖ్యా ఆలయానికి గతంలో సందర్శించినప్పుడు, కామాఖ్యా ప్రధాన ఆలయ ఖర్చును తన రిలయన్స్ సంస్థ భరిస్తుందని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు.

also read డీమోనిటైజేషన్ కంటే కరోనా కాలంలోనే పెరిగిన డిజిటల్ పేమెంట్ లావాదేవీలు: సర్వే రిపోర్ట్ ...

ఆలయ ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మొత్తం పనులు దీపావళి నాటికి పూర్తి చేస్తామని ఆలయ పూజారి దీప్ శర్మ వెల్లడించారు.  రిలయన్స్ గ్రూప్ ఇంజనీర్లు, కార్మికులు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు.

పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం గోపుర కలశాల పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఆలయ ప్రాంగణంలో కూడా కఠినమైన భద్రత రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఈ దేవాలయాన్ని మూసివేయగా ప్రోటోకాల్‌ అనుగుణంగా అక్టోబర్ 12 నుంచి మళ్లీ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.

కామాఖ్యా టెంపుల్ ట్రస్ట్ బోర్డ్  మెంబర్  మోహిత్ చంద్ర శర్మ మాట్లాడుతూ, "రిలయన్స్ గ్రూప్ వారి సంస్థ నుండి కఠినమైన భద్రతతో తెచ్చిన బంగారాన్ని మేము అందుకున్నాము. ఆలయ ప్రాంగణానికి రిలయన్స్ సంస్థ స్వయంగా భద్రత కల్పించింది. ” అని అన్నారు.