ఉబెర్ టాక్సీ బుక్ చేసుకొని ఎదురు చూసిన ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా...అసలు ఏం జరిగిందంటే..?

ఒకరు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, మరొకరు భారత దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ చైర్మన్ వీరిద్దరూ తాము ఎక్కాల్సిన బస్సు మిస్ చేసుకుని, ఉబర్ టాక్సీ బుక్ చేసుకొని దాని కోసం ఎదురుచూసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ దీని వెనకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం

Mukesh Ambani and Anand Mahindra who booked an Uber taxi and waited... What actually happened MKA

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు దేశంలో కూడా నెంబర్ వన్ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ  తన ప్రయాణం కోసం ఉబర్ టాక్సీను బుక్ చేసుకున్న ఘటన అమెరికాలో చోటుచేస్తుంది.  అయితే విచిత్రం ఏమిటంటే ఈ టాక్సీలో ప్రయాణించేందుకు మరో భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా సైతం ఉండటం విశేషం.  ఒకరు ప్రపంచంలోనే టాప్ కుబేరుల్లో ఒకరు.. మరొక పారిశ్రామికవేత్త దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి చైర్మన్.. వీరిద్దరూ కాలు కదిపితే చాలు,  ఖరీదైన కార్లు వీరి కోసం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటాయి.  నేల మీద కాలు పెట్టకుండా ఖరీదైన కార్లలో ఎక్కడికైనా వెళ్ళగలిగే సౌకర్యం వీళ్లిద్దరికీ ఉంది.  అయినప్పటికీ ఒక సందర్భంలో మాత్రం ఈ కుబేరులంతా తాము వెళ్లాల్సిన బస్సు కావడంతో ఎవరికి ఉబర్ టాక్సీ లో వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే..

గత శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీ హాజరయ్యారు.  ఈ విందుకు  ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ విందుకు ముందు  వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో భారత్‌-అమెరికా మధ్య జరిగిన హైటెక్‌ హ్యాండ్‌ షేక్‌ సమావేశంలో భాగంగా ఓ భేటీ జరిగింది.  ఈ భేటీలో US వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో, థర్డ్ టెక్ సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో  ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదుపరి తాము విందుకు వెళ్లాల్సిన షటిల్ బస్ మిస్ చేసుకున్నారు. ఆ సమయంలో ఆ భేటీకి  భారతీయ సంతతికి చెందిన ప్రముఖ మహిళా వ్యోమగామి  సునీతా విలియమ్స్ సైతం రావడం విశేషం.  విచిత్రంగా వీరంతా ఆ బస్సు ను మిస్ చేసుకున్న వారిలో ఉన్నారు. దీంతో అక్కడే ఉన్నటువంటి ఆనంద్ మహీంద్రా తామంతా బస్సు మిస్ చేసుకున్నామని ప్రస్తుతం ఉబర్ టాక్సీ బుక్ చేసుకుంటున్నామని సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ సెల్ఫీ ఫ్రేమ్లో ఆనంద్ మహీంద్రా తో పాటు ముఖేష్ అంబానీ అలాగే సునీత విలియమ్స్ సైతం ఉండటం విశేషం. ట్విట్టర్‌లో పంచుకున్న ఈ ఫోటోతో పాటు, ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశాడు, "వాషింగ్టన్ మూమెంట్ అని నేను భావిస్తున్నాను." నిన్న, హాండ్ షేక్ సమావేశం తరువాత, నేను, ముఖేష్ అంబానీ, బృందా కపూర్ US వాణిజ్య కార్యదర్శితో చర్చలు జరిపాము. ఈ సందర్భంగా మమ్మల్ని తదుపరి డిన్నర్‌కి తీసుకెళ్లాల్సిన.బస్సు మిస్ అయింది. ఈ సమయంలో మేము Uberకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మా పక్కనే ఉన్న NASA వ్యోమగామి సునీతా విలియమ్స్‌ని కలుసుకుని ఆమెతో సెల్ఫీ దిగాము. అలాగే మేము సరదాగా మాట్లాడుకున్నాము ఉబెర్‌కు బదులుగా ఆమె స్పేస్ షటిల్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు" అని మహీంద్రా తన ట్వీట్ లో రాసుకొచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios