Motorola Edge 50 Fusion: జస్ట్ రూ.16 వేలకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్
Motorola Edge 50 Fusion Discounts: మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ రిలీజ్ అయిన మొదట్లో ధర రూ.22,999 ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,000 లోపే లభిస్తుంది. బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకునే వారికి ఇది సూపర్ ఛాయిస్. తక్కువ ధరకు ఈ మొబైల్ ఎలా కొనాలో ఇక్కడ తెలుసుకోండి.

మంచి కెమెరా, సూపర్ డిస్‌ప్లేతో ఒక మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒక మంచి ఛాయిస్. ఇది ముందుగా ఇండియాలో రూ.22,999 కి వచ్చింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.18,000 లోపే లభిస్తుంది. రూ.20,000 లోపు అన్ని ఫీచర్లు ఉన్న ఒక ట్రెండీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కొనుక్కోండి. దీన్ని తక్కువ ధరకు ఎలా కొనాలో ఇక్కడ చూద్దాం.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ పై డిస్కౌంట్లు
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఇండియాలో కొత్తగా వచ్చినప్పుడు దాని ధర రూ.22,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 తక్షణ తగ్గింపుతో రూ.20,999 కి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయిస్తున్నారు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.12,700 వరకు ఆఫర్ ఇస్తున్నారు. కానీ ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పూర్తిగా రాదు. అదే ఇందులో ఉన్న ట్విస్ట్. కానీ మీ దగ్గర రూ.15,000 విలువైన మొబైల్ ఉంటే అందులో రూ.5000 వరకు ఆదా చేయవచ్చు. అప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కేవలం రూ.15,999 కి లభిస్తుంది.
ఇది కూడా చదవండి మీకు మొబైల్ గేమ్స్ అంటే ఇష్టమా? iQOO నుంచి సూపర్ గేమింగ్ మొబైల్ వచ్చేస్తోంది
మోటో ఎడ్జ్ 50 ఫ్యూషన్ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-ఇంచ్ FHD+ OLED స్క్రీన్ ఉంది. ఇందులో 10-బిట్ కలర్ సపోర్ట్, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఈ డిస్‌ప్లేను కాపాడుతుంది. దీని బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 7s Gen 2 CPU, 512GB (UFS 2.2) స్టోరేజ్, 12GB LPDDR4X RAM వరకు ఉంది. 5000 mAh బ్యాటరీ, 68-వాట్ క్విక్ ఛార్జింగ్ ఈ మొబైల్‌కు పవర్ ఇస్తుంది. ఫోటోలు తీయడానికి 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP Sony LYT-700C ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో ఉంది. సెల్ఫీ తీసుకోవడానికి 32MP మెయిన్ కెమెరా ఉంది.
ఇది కూడా చదవండి వివో T4x వర్సెస్ ఫోన్ 1.. ఏది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్?

