ముంబై: దేశంలో కొందరు సులువుగా డబ్బు సంపాదించాలనే అలోచనలతో అడ్డదారులను ఎంచుకుంటుంటారు. అందులో ఒకటి ఈ ఆన్లైన్ స్కామ్ లేదా సైబర్ క్రైమ్ అని అంటారు. ఈ రోజుల్లో చాలా వరకు అందరూ ఆన్ లైన్ పేమెంట్ పద్దతినే పాటిస్తున్నారు. డిజిటల్ పేమెంట్ వైపు దేశం అడుగులేస్తున్న తరుణంలో కొందరు ఇతరుల క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ లావాదేవిలపై సొమ్ముచేసుకోవాలని చేస్తుంటారు.

also read గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

ఎలాంటివి జరగకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డులపై ఒక కొత్త  వెసులుబాటును కల్పిస్తుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వినియోగదారులు వారి కార్డును అవసరం ఉన్నప్పుడు స్విచ్‌ ఆన్‌ లేదా స్విచ్‌ ఆఫ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు, ఇతర సంస్థలను ఆర్‌బీఐని కోరింది.

గడిచిన కొన్నేళ్లలో కార్డు ద్వారా లావాదేవీలు, వాటి విలువ పలు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలకు మరింత రక్షణ కల్పించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  భౌతిక లేదా వర్చువల్‌ కార్డు జారీ సమయంలో వాటిని కేవలం ఇండియాలోని ఏటీఎం లేదా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టర్మినళ్లు కాంటాక్ట్‌ పాయింట్ల వద్ద వినియోగించుకునే అవకాశాన్ని మాత్రమే కల్పించాలి.


 
క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డు జారీ చేసే ఏదైనా బ్యాంక్‌ లేదా సంస్థలు వినియోగదారుడికి కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ (దేశీయంగా, అంతర్జాతీయంగా) లావాదేవీలు, కార్డు ప్రజెంట్‌ (అంతర్జాతీయ) లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు వంటి ఆప్షన్లను యాక్టివేట్‌ లేదా డీయాక్టివేట్‌ చేసుకునే ఒక కొత్త ఫీచర్ని కల్పించాలంటూ ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. 

also read 42వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్... మార్కెట్ పై ప్రభావం చూపనున్న సుప్రీం తీర్పు

కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ ఆప్షన్‌ ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించినది కాబట్టి లావాదేవీల విషయంలో స్విచ్‌ ఆన్‌/ఆఫ్‌ వెసులుబాటుతో పాటు లావాదేవీల పరిమితిని లేదా సవరణకు అవకాశం కల్పించడం. ఈ ఆప్షన్‌ ఎంచుకునే వారికి అన్ని రకాల (దేశీయ, అంతర్జాతీయ, పీఓఎస్‌, ఏటీఎం, ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌) లావాదేవీలను అన్ని మార్గాల్లో (మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఐవీఆర్‌) వారంలో 24 గంటలపాటు అందుబాటులో ఉంచాలి.

ఇప్పటికే జారీ చేసిన కార్డుల విషయంలో వినియోగదారుల రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే వారికి తగిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఇప్పటి వరకు ఆన్‌లైన్‌(కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌)/అంతర్జాతీయ/కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఉపయోగించని కార్డును ఈ ఆప్షన్లను తప్పనిసరిగా డీయాక్టివేట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
తాజా ఆదేశాలు ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డ్‌లు, మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌లో ఉపయోగించే సాధనాలకు మాత్రం తప్పనిసరి కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.