న్యూఢిల్లీ: ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ భారత్ అభివృద్ధి రేటింగ్ ఔట్ లుక్ విషయమై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి గట్టి షాకే ఇచ్చింది. ఇప్పటి వరకు భారత్ వృద్ధి ఔట్ లుక్ ‘స్టేబుల్’గా ఉన్నదని పేర్కొన్న మూడీస్.. భారత ఆర్థిక వ్యవస్థ ‘నెగెటివ్’ దిశగా ప్రయాణిస్తోందని తెలిపింది. గతంతో పోలిస్తే దేశ ఆర్థికాభివృద్ధి మరింత దిగజారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. 

also read ఎట్టకేలకు ట్రేడ్‌వార్‌కు ఎండ్: సుంకాల విత్ డ్రాకు అమెరికా-చైనా రెడీ

ఆర్థిక, సంస్థాగత బలహీనతలను పరిష్కరించడంలో తాము అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా ప్రతిస్పందిస్తున్నదని మూడీస్ అభిప్రాయ పడింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు వృద్ధి రేటు మందగమన పరిష్కారానికి వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. 

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడిదొడుకులను మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని మూడీస్ సూచించింది. వానిజ్య పెట్టుబడుల పెంచే వృద్ధిని మరింత వేగంగా పరుగులు పెట్టించే సంస్కరణల అవకాశాలు తగ్గిపోయాయని మూడీస్ వెల్లడించింది.

aslo read ఐదవ రోజు....పడిపోయిన పెట్రోల్ ధరలు

కానీ మూడీస్ రేటింగ్స్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కొట్టి పారేసింది. భారతదేశ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నదని పేర్కొన్నది. స్వల్ప, మధ్య కాలిక వృద్ధికి భారతదేశంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత భారతదేశం పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ పేర్కొన్నది. దీనివల్ల భారతదేశానికి పెట్టుబడులు తరలి వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించింది. భారత వృద్ధిరేటు 2019లో 6.1 శాతానికి, వచ్చే ఏడాది ఏడు శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని ఇటీవల ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదికను ఆర్థిక శాఖ గుర్తుచేసింది.