ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేళ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే టార్గెట్‌గా పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల శివారులో ప్రాక్టర్అండ్ గ్యాంబిల్(పీఅండ్బీ) రూ.రెండు వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన లిక్విడ్ డిటర్జెంట్ తయారీ ఫెసిలిటీని ప్రారంభించారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చే పదేళ్ల కాలంలో 16 లక్షల ఉద్యోగాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. పరిశ్రమలకు తెలంగాణ అడ్డాగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు తెలంగాణలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తెలంగాణలో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు.
రూ.50 లక్షల టీవీలు
తెలంగాణలో శాంతిభద్రతలు, మౌలిక వసతులు, ప్రభుత్వం సహకారం కారణంగానే చాలా కంపెనీలు తమ వ్యాపార కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రేడియంట్ సంస్థ ఎల్‌ఈడీ టీవీలను తయారు చేస్తుందన్నారు. తెలంగాణలో ఈ సంస్థ 50 లక్షల టీవీలు తయారుచేయనుందన్నారు. ఈ సంస్థలో పనిచేసే వారిలో 50 శాతం మహిళలు, స్థానికులు ఉన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ముందుందన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో పీ అండ్ జీ లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.200 కోట్లకు పైగా విలువైన కంపెనీని ఇవాళ ప్రారంభించుకున్నామన్నారు. భవిష్యత్ లో లిక్విడ్ డిటర్జెంట్స్ అని పీ అండ్ జీ ప్రతినిధులు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో పీ అండ్ జీ తెలంగాణలోని అన్ని వర్గాలకు మద్దతు నిలిచిందన్నారు. జెండర్ ఈక్వాలిటీ కోసం పీ అండ్ జీ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. 2014లో సీఎం కేసీఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రంలో పీ అండ్ జీ తన కార్యకలాపాలను విస్తరించిందని పేర్కొన్నారు. తెలంగాణకు నిరంతరం మద్దతు తెలపాలని కోరుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కంపెనీ ఇండియన్ సబ్‌కాంటినెంట్ సీఈఓ మధుసూదన్ గోపాలన్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బిజినెస్ చేయడం చాలా ఈజీ కాబట్టే మా ప్లాంటు కోసం కొత్తూరును ఎంచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీలు బాగున్నాయి. మౌలిక సదుపాయాలూ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఇక్కడ తయారైన ప్రొడక్టులను దేశమంతటా అమ్ముతాం. మా బిజినెస్‌కు హైదరాబాద్ మార్కెట్ చాలా ముఖ్యం. ఈ ప్లాంటుతోపాటు ప్లానింగ్ సర్వీస్ సెంటర్‌ను, టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేశాం”అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు హాజరయ్యారు. పీ అండ్జీకి ఈ యూనిట్ ఇండియాలోనే అతిపెద్దది. దీనిని 170 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ఏరియల్, టైడ్ వంటి వాషింగ్ పౌడర్లు, పాంపర్స్ బ్రాండ్ బేబీ కేర్ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమం కోసం వచ్చిన మీడియా వారికి చేదు అనుభవం ఎదురైంది. చాలాసేపు మీడియా ప్రతినిధులు గేట్ బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు అనుమతి ఇచ్చారు. మీడియాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.
