Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్.. ఇక మేనేజ‌ర్ల అనుమ‌తితో ఉద్యోగులు శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసుకోవచ్చు..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉద్యోగుల ఆరోగ్య  భద్రత కోసం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రోం హోం  చేస్తూన్నారని, వచ్చే ఏడాది జనవరి వరకు మైక్రోసాఫ్ట్ యు.ఎస్ కార్యాలయాలను తిరిగి ప్రారంభిచే ఆలోచన లేదని చెప్పారు.
 

Microsoft To Let Employees Work From Home Permanently in united states : Report
Author
Hyderabad, First Published Oct 10, 2020, 11:00 AM IST

వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కోరుకుంటే వారికి శాశ్వతంగా వర్క్ ఫ్రోం హోం  పనిచేయడానికి వీలు కల్పిస్తామని యుఎస్ మీడియా శుక్రవారం నివేదించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉద్యోగుల ఆరోగ్య  భద్రత కోసం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రోం హోం  చేస్తూన్నారని, వచ్చే ఏడాది జనవరి వరకు మైక్రోసాఫ్ట్ యు.ఎస్ కార్యాలయాలను తిరిగి ప్రారంభిచే ఆలోచన లేదని చెప్పారు.

ఉద్యోగులు వారి నివాసాల నుండి శాశ్వతంగా వర్క్ ఫ్రోం హోం చేయడానికి ఎంచుకోవచ్చు, అయితే  ఆఫీస్ స్థలాన్ని వదులుకోవలసి ఉంటుంది. వ్య‌క్తిగ‌త వ‌ర్క్ స్ట‌యిల్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు వీలైనంత స‌హ‌క‌రిస్తామ‌ని, అదే విధంగా వ్యాపారం కూడా కొన‌సాగేలా చూస్తామ‌న్నారు.

also read ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటి కంపెనీగా టిసిఎస్.. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ తర్వాత 2వ భారతీయ కంపెనీగా ఘ...

ప‌ర్మ‌నెంట్ ప‌ద్ధ‌తిలో ఇంటి నుంచి ప‌ని చేయాల‌నుకున్న‌వాళ్లు త‌మ మేనేజ‌ర్ల నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. "కోవిడ్ -19 మహమ్మారి మనందరినీ కొత్త మార్గాల్లో ఆలోచించడం, జీవించడానికి సవాలు చేసింది" అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కాథ్లీన్ హొగన్ ఉద్యోగులకు ఇచ్చిన నోట్‌లో పేర్కొన్నారు.

కొంతమంది ఉద్యోగులు అంటే మైక్రోసాఫ్ట్ ల్యాబ్‌లలో పనిచేసేవారు లేదా ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే వారికి శాశ్వత వర్క్ ఫ్రోం హోంకి అర్హులు కాదు. పునరావాసం పొందిన వారు ఎక్కడికి మారుతారో దాని బట్టి వారి జీతాలు మారవచ్చు అలాగే కంపెనీ ఉద్యోగుల వర్క్ ఫ్రోం హోం ఖర్చులను భరిస్తుంది, కానీ పునరావాస ఖర్చులను భరించదు.

సెక్యూరిటీల ఫైలింగ్ ప్రకారం జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ 163,000 మందికి ఉపాధి కల్పించింది, వారిలో 96,000 మంది యుఎస్ లో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios