Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్, ఫేస్ బుక్, అమెజాన్ తర్వాత గూగుల్ లో కూడా ఉద్యోగాల తొలగింపు..? కారణం ఏంటంటే..

ఆక్టివిస్ట్  ఇన్వెస్టర్ TCI ఫండ్ మేనేజ్‌మెంట్ ఖర్చులను తగ్గించుకోవడానికి  వర్క్‌ఫోర్స్‌ను తగ్గించమని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ను కోరింది. ఆక్టివిస్ట్  ఇన్వెస్టర్ TCI 2017 నుండి ఆల్ఫాబెట్‌లో ఆరు బిలియన్ల వాటా ఉన్న పెట్టుబడిదారి. 

Meta to Amazon: Why big tech companies are laying off employees slowing hiring know why
Author
First Published Nov 16, 2022, 10:19 AM IST

ఈ రోజుల్లో పెద్ద ఐటి కంపెనీలు ఆర్ధిక మాంద్యం ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ కంపెనీలు ఉద్యోగుల కోత విధిస్తున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే గూగుల్ నుంచి కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

ఆక్టివిస్ట్  ఇన్వెస్టర్ TCI ఫండ్ మేనేజ్‌మెంట్ ఖర్చులను తగ్గించుకోవడానికి  వర్క్‌ఫోర్స్‌ను తగ్గించమని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ను కోరింది. ఆక్టివిస్ట్  ఇన్వెస్టర్ TCI 2017 నుండి ఆల్ఫాబెట్‌లో ఆరు బిలియన్ల వాటా ఉన్న పెట్టుబడిదారి. కంపెనీకి చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగి ఖర్చు చాలా ఎక్కువగా ఉందని కంపెనీకి చెప్పారు.

 ఎంప్లాయ్ ఇన్వెస్టర్ TCI ఆల్ఫాబెట్ ఉద్యోగులలో చాలా మందికి ఎక్కువ వేతనాలు ఉన్నట్లు తెలిపింది. దీనితో పాటు రిక్రూట్‌మెంట్ పరంగా కంపెనీ 2017 నుండి నిరంతరం 20 శాతం పెరిగింది ఇంకా రెట్టింపు చేస్తోంది, దీనిని తగ్గించాల్సిన అవసరం ఉంది. అయితే, ఆల్ఫాబెట్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పందన చేయలేదు. 

ఆల్ఫాబెట్ రిక్రూట్‌మెంట్‌ను సగానికి పైగా 
ఈ రోజుల్లో ఆల్ఫాబెట్ ప్రకటనదారులచే ఖర్చు తగ్గించే సమస్యను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితిలో అక్టోబర్ చివరిలో రిక్రూట్‌మెంట్‌ను సగానికి పైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఖర్చులను నియంత్రించాల్సిన  అవసరం
ఆదాయ వృద్ధి మందగించినందున ఇప్పుడు ఖర్చులను క్రమశిక్షణలో ఉంచాల్సిన అవసరం ఉందని ఆల్ఫాబెట్ వాటాదారి మేనేజ్‌మెంట్ అండ్ బోర్డుకి రాసిన లేఖలో తెలిపారు.  

ఎక్కడి నుంచి ఎంత మంది ఉద్యోగులను తొలగించారు అనే సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 3700 మందిని ట్విట్టర్ నుంచి తొలగించారు. అలాగే 11,000 మంది ఉద్యోగులు మెటా నుండి, మైక్రోసాఫ్ట్ విషయంలో కూడా దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్ 500 మందిని, స్నాప్‌చాట్ 1500 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ కూడా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

దాదాపు 10,000 ఉద్యోగాల కోతలను అమెజాన్ ప్రకటించడంతో సిలికాన్ వ్యాలీ కష్టకాలం కొనసాగుతోంది. కంపెనీల చరిత్రలో ఇవి అతిపెద్ద ఉద్యోగాల కోతగా కొందరు భావిస్తున్నారు. 

ఇతర టెక్ కంపెనీలు
స్ట్రైప్, సేల్స్‌ఫోర్స్, లిఫ్ట్, బుకింగ్.కామ్, ఐరోబోట్ అండ్ పెలోటన్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ స్ట్రైప్ సిబ్బందిలో 14 శాతం మందిని తొలగించింది. భారతదేశంలో బైజూస్, ఆన్ ఆకాడెమీ ఇతర కంపెనీలు కూడా చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. బైజూస్ మాత్రం 2500 మంది సిబ్బందిని తొలగించింది, బైజూస్ భారతదేశంలోని అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటి.

Follow Us:
Download App:
  • android
  • ios