Asianet News TeluguAsianet News Telugu

"మెటాలో పనిచేయడం నా కల".. ఉద్యోగాల తొలగింపు పై మహిళా ఉద్యోగి పోస్ట్..

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్‌ బుధవారం తొలగించిన 11వేల మంది ఉద్యోగులలో అన్నెకా పటేల్ ఒకరు . లింక్డ్‌ఇన్‌ లో ఆమె “మెటా #లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన 11వేల మంది ఉద్యోగులలో నేను ఒకరినని ఈ ఉదయం తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నందున  ఈ విషయం నన్ను తీవ్రంగా దెబ్బతీసింది." అంటూ పోస్ట్ చేసింది.
 

Meta Layoffs Woman Fired While On Maternity Leave Heres What She Said
Author
First Published Nov 11, 2022, 12:49 PM IST

 ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా కంపెనీ చరిత్రలో భారీ ఉద్యోగాల కోతను ప్రకటించిన సంగతీ మీకు తెలిసిందే. మెటా 11వేల మంది ఉద్యోగులను అంటే దాదాపు 13% మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా తాజాగా తేలిపింది. అయితే తొలగించిన 11వేల ఉద్యోగులలో ఫేస్‌బుక్‌లో మాజీ కమ్యూనికేషన్ మేనేజర్ అన్నెకా పటేల్ కూడా ఒకరు.

మా మూడు నెలల పాప ఎమిలియా కోసం నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచాను. ఉద్యోగుల తొలగింపుల గురించి ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ నుండి ఇమెయిల్ వస్తుందని  నేను ఆఫీస్ ఇమెయిల్‌ చెక్ చేసాను. ఊహించినట్లుగానే తొలగింపు పై నాకు  ఇమెయిల్ వచ్చింది అంటూ పోస్ట్ చేసింది. ఆయితే అన్నెకా పటేల్ ప్రసూతి సెలవు ఫిబ్రవరి 2023న ముగుస్తుంది, కానీ ఫేస్ బుక్ లో కమ్యూనికేషన్స్ మేనేజర్‌గా ఆమె ప్రయాణం ముగిసినట్లు తెలుసుకుంది.

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్‌ బుధవారం తొలగించిన 11వేల మంది ఉద్యోగులలో అన్నెకా పటేల్ ఒకరు . లింక్డ్‌ఇన్‌ లో ఆమె “మెటా #లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన 11వేల మంది ఉద్యోగులలో నేను ఒకరినని ఈ ఉదయం తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం ప్రసూతి సెలవుపై ఉన్నందున  ఈ విషయం నన్ను తీవ్రంగా దెబ్బతీసింది." అంటూ పోస్ట్ చేసింది.

అన్నేకా పటేల్ యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో పూర్వ విద్యార్థి అండ్ లండన్‌లో రెండున్నర సంవత్సరాల నుండి ఫేస్‌బుక్‌లో పని చేస్తుంది. 

ఫేస్‌బుక్ పేరెంట్ మెటా 11వేల మంది ఉద్యోగులను  తొలగించనుంది, ఫేస్ బుక్ బిజినెస్ ఆదాయం, టెక్ పరిశ్రమ కష్టాలతో పోరాడుతున్నందున ఈ నిర్ణయం వచ్చినట్లు సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.

ట్విట్టర్‌ కొత్త అధినేత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగాల తొలగింపులు జరిగిన ఒక వారం తర్వాత ఫేస్ బుక్ ఉద్యోగాల కోతలు వచ్చాయి. 

మార్క్ జుకర్‌బర్గ్ నుండి మెయిల్ వచ్చిన తర్వాత తన మూడు నెలల కుమార్తె నిద్రపోయాక తన మేనేజర్‌తో మాట్లాడినట్లు, అతను కూడా  ఉద్యోగం నుండి తొలగించబడినట్లు తెలిసిందని  అన్నెకా పటేల్ తెలిపింది.

తొమ్మిదేళ్ల క్రితం లండన్ నుండి బే ఏరియాకు మారినప్పుడు మెటాలో పనిచేయడం తన కల అని అన్నేకా పటేల్ పేర్కొంది. ఉద్యోగం తొలగించినప్పటికీ మేటా గురించి అన్నేకకు చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. 

 ఆమె తన కుమార్తెతో కొన్ని నెలలు గడిపిన తర్వాత 2023 నూతన సంవత్సరం నుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. మెటా ఈ రోజు చాలా మంది టాలెంటెడ్ వ్యక్తులను కోల్పోయింది, నేను ప్రభావితమైన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లోని ఎవరికైనా నేను పరిచమైతే నేను చాలా సంతోషిస్తాను అంటూ అన్నెకా  పటేల్ పోస్ట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios