Asianet News TeluguAsianet News Telugu

మారుతి సుజికి సంచలన నిర్ణయం, 9125 కార్ల రీకాల్, మీ కారు మోడల్ కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

మారుతి సుజుకి రీకాల్: మారుతి సుజుకి 9125 వాహనాలను రీకాల్ చేసింది, ఏయే మోడల్స్ ఇందులో ఉన్నాయో తెలుసుకోండి..

Maruti Suzuki recalls 9125 vehicles know which models are included
Author
First Published Dec 7, 2022, 9:51 AM IST

దేశంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 9125 కార్లను రీకాల్ చేయనుంది. వీటిలో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, XL6,గ్రాండ్ విటారా వంటి మోడల్ కార్లను  ఈ రీకాల్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే భద్రతా పరమైన లోపాలు ఉన్న కారణంగాగానే మారుతీ తన వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, XL6, గ్రాండ్ విటారా వంటి మోడల్స్ ఇందులో ఉన్నాయి.ప్రయాణీకుల భద్రత కోసం ఉద్దేశించిన ఫీచర్లలో లోపాలు ఉన్న కారణంగానే 2022, నవంబర్ 2 మరియు 28 తేదీల మధ్య విక్రయించిన మొత్తం 9,125 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతీ సుజుకి ప్రకటించింది.

కంపెనీ ప్రకారం, పైన పేర్కొన్న మోడల్స్ కార్లలో  ముందు వరుస సీట్ బెల్ట్ షోల్డర్ హైట్ అడ్జస్టర్, అసెంబ్లీలోని చైల్డ్ పార్ట్‌లలో లోపం ఉందని తెలిపింది. ఈ లోపం ప్రభావంతో సీటు బెల్ట్ సరిగ్గా ఫిక్స్ కాకపోయే ప్రమాదం ఉంది. అలాగే మధ్యలోనే సీటు బెల్టు విడిపోయే అవకాశం కూడా ఉంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. దీంతో మారుతీ సుజుకీ తమ వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది.

కంపెనీ ఒక ప్రకటనలో, "మా కస్టమర్ల భద్రత, జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తన వాహనాలను తనిఖీ కోసం రీకాల్ చేస్తున్నామని, లోపం ఉన్న భాగాలను గుర్తించి రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రభావిత వాహన యజమానులు మారుతి సుజుకి  రిజిస్టర్డ్ వర్క్‌షాప్‌ సందర్శించాలని తెలిపింది. 

ఒకే సంవత్సరంలో రెండవసారి రీకాల్
ఈ సంవత్సరం మారుతికి ఇది రెండవ రీకాల్. అంతకుముందు, కంపెనీ ఆగస్టులో తన వాహనాలను రీకాల్ చేసింది. ఆ సమయంలో, మొత్తం 166 డిజైర్ టూర్ వాహనాలు భద్రతా ఫీచర్ లోపాన్ని కలిగి ఉన్నట్లు కనుగొంది, దాని కారణంగా వాటిని రీకాల్ చేశారు. ఆ సమయంలో కూడా కేవలం సేఫ్టీ సంబంధిత ఫీచర్లలోనే లోపం గుర్తించడం గమనార్హం. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లో లోపం కారణంగా ప్రభావితమైన కార్లను రీకాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios