Maruti Suzuki Fronx SUV: మారుతి నుంచి 8 లక్షల లోపు కారు కావాలా..అయితే మారుతి సరికొత్త ఫ్రాంక్స్ SUV మీ కోసం..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ని భారత కార్ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.46 లక్షలుగా నిర్ణయించారు. శక్తివంతమైన ఇంజన్ కలిగిన టాప్-ఎండ్ ఆల్ఫా డ్యూయల్ టోన్ ధర రూ. 13.13 లక్షల వరకు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతి ఫ్రాంక్స్‌ను కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది, ఇది ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో బుకింగ్స్ ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ. 7.76 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. 13.13 లక్షలుగా ఉంది. మీ బడ్జెట్ , ఫీచర్ అవసరాలను తీర్చే ఈ క్రాస్ఓవర్ కారు నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విభిన్న బడ్జెట్‌లను కలిగి ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV 5 వేరియంట్‌లను కస్టమర్లకు పరిచయం చేసింది. ఇందులో, మొదటి వేరియంట్ సిగ్మా, రెండవది డెల్టా, మూడవది డెల్టా +, నాల్గవ జీటా , ఐదవ వేరియంట్ ఆల్ఫా. మారుతి ఫ్రాంక్స్ సిగ్మా బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 7,46,500 , తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన కారు కోసం వెతుకుతున్న వారికి ఇది సరైన చాయిస్ గా చెప్పవచ్చు.
వేరియంట్స్ |
ధరలు |
1.2L Sigma MT |
7.46 లక్షలు |
1.2L Delta MT |
8.32 లక్షలు |
1.2L Delta AMT |
8.87 లక్షలు |
1.2L Delta+ MT |
8.72 లక్షలు |
1.2L Delta+ AMT |
9.27 లక్షలు |
1.0L Delta+ MT |
9.72 లక్షలు |
1.0L Zeta MT |
10.55 లక్షలు |
1.0L Zeta AT |
12.05 లక్షలు |
1.0L Alpha MT |
11.47 లక్షలు |
1.0L Alpha AT |
12.97 లక్షలు |
1.0L Alpha MT Dual-Tone |
11.63 లక్షలు |
1.0L Alpha AT Dual-Tone |
13.13 లక్షలు |
మారుతి ఫ్రాంక్స్ ఇంజిన్ , ట్రాన్స్మిషన్
మారుతి ఫ్రాంక్స్‌లో, కంపెనీ రెండు ఇంజన్‌ల ఎంపికను ఇచ్చింది, దీనిలో మొదటి ఇంజన్ 1 లీటర్ టర్బో పెట్రోల్ బూస్టర్‌జెట్ ఇంజన్, ఇది 100 PS శక్తిని , 148Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించారు. రెండవ ఇంజన్ 1.2L Dualjet పెట్రోల్ ఇంజన్, ఇది 90PS పవర్ , 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్ , 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతాయి.
మారుతి ఫ్రాంక్స్ మైలేజ్
ఈ SUV మైలేజీ గురించి మారుతి సుజుకి క్లెయిమ్ చేస్తూ, ఈ SUV 21.5 kmpl నుండి 22.89 kmpl వరకు మైలేజీని ఇస్తుందని , ఈ మైలేజీని ARAI ధృవీకరించింది.
మారుతి ఫ్రాంక్స్ ఫీచర్లు
ఫీచర్ల గురించి మాట్లాడుతూ, ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ , వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను కంపెనీ అందించింది.
మారుతి ఫ్రాంక్స్ సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ మాట్లాడుకుంటే, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ISO ఫిక్స్‌డ్ యాంకర్లు , EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.