Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడమే ఇందుకు కారణం. సెన్సెక్స్​ 42 వేల మార్కును తొలిసారి అందుకుంది. నిఫ్టీ 12, 380 పాయింట్లతో గరిష్ఠస్థాయి రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో పరుగులు తీశాయి. కానీ మధ్యాహ్నానికల్లా ద్రవ్యలోటుపై నెలకొన్న ఆందోళన ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. 
 

Market Today LIVE Updates: Sensex, Nifty pare morning gains, turn flat; Metal stocks decline
Author
Hyderabad, First Published Jan 16, 2020, 1:38 PM IST

అమెరికా-చైనా మధ్య కుదిరిన తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లకు ఊపు వచ్చింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్​ తొలిసారిగా 42 వేల మార్కును అందుకుని ట్రేడవుతోంది. 

కానీ మధ్యాహ్నం ట్రేడింగ్‌లో ఉదయం సాధించిన లాభాలు హరించుకుపోయాయి. మధ్యాహ్నం 12.05 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 24.24 పాయింట్లు నష్టపోయి 41,848.49 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 11.05 పాయింట్లు నష్టపోయి 12,332.25 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. మెటల్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 97.03 పాయింట్లు, స్మాల్ క్యాప్ 79.85 పాయింట్లు నష్టపోయింది. 

బొంబై స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 129 పాయింట్లు లాభపడి 42,059.45 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. బుధవారం సెన్సెక్స్ 41,994.26 పాయింట్ల వద్ద ముగిసింది. 

మరోవైపు జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 31 పాయింట్లు వృద్ధి చెంది 12,389.05 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ట్రేడింగ్ లో 12,374.25 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది. 

గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 151.12 పాయిట్లతో లాభ పడి 42,023.85 పాయింట్లతో ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా 34.75 పాయింట్లు పైకెగిసి 12,378.05 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. 

ఎస్​ బ్యాంకు, నెస్లే, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​ కార్ప్​, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ షేర్లు రాణిస్తున్నాయి.వేదాంత, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, హీరో మోటోకార్ప్​, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్​ నేలచూపులు చూస్తున్నాయి.

18 నెలలుగా సాగుతున్న అమెరికా​-చైనా వాణిజ్య యుద్దానికి ఎట్టకేలకు తెర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 153.15 పాయింట్లు లాభ పడింది. నెస్లే ఇండియా, హిందూస్థాన్ లీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 89.15 పాయింట్లు లబ్ధి పొందింది. 

Also Read ఇక సైబర్ ఫ్రాడ్‌కు చెక్: డెబిట్/క్రెడిట్‌ కార్డుల వినియోగం ఆర్బీఐ న్యూ రూల్స్...

రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం విజయవంతమైన నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్ వాల్​స్ట్రీట్​ను లాభాలు ముంచెత్తాయి. ఆసియా మార్కెట్లలో నిక్కీ, కోస్పీ లాభాల్లో కొనసాగుతుండగా, హాంగ్​సెంగ్​, షాంఘై కాంపోజిట్​ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 

రూపాయి విలువ ఏడు పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.75గా ఉంది. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.61 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.45 డాలర్లుగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios