Asianet News TeluguAsianet News Telugu

కోలుకున్న స్టాక్ మార్కెట్లు... లాభాల్లో సూచీలు...

దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ ఉద్రిక్తతలు తిరిగి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనల మధ్య మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో ‘బ్లాక్ మండే‘గా నమోదైన ఈ నెల ఆరో తేదీన మూడు గంటల్లో మదుపర్లు రూ.3 లక్షల కోట్ల మేరకు నష్టపోయారు. 
 

Market erases early gains; Sensex up 250 points, Nifty above 12,000
Author
Hyderabad, First Published Jan 7, 2020, 1:15 PM IST

ముంబై: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతానికి కాసింత స్తబ్దుగా మారడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. మంగళవారం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 498 పాయింట్లు లాభ పడి 41,175 వద్ద కొనసాగుతున్నది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 141 పాయింట్లు ఎగిసి 12,134 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. 

మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయ మారకం విలువ 71.64 రూపాయిలుగా ఉంది. అయితే ఏ క్షణంలోనైనా పరిస్థితిులు తిరిగి ఉద్రిక్తంగా మారొచ్చునన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో మదుపర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. జీ ఎంటర్‪టైన్మెంట్, వేదాంత, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ లాభాల్లో ట్రేడవుతోంది.

టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ, లోహాల సూచీలు లాభాలు ప్రయాణిస్తున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తలతో సోమవారం స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్ మండే’గా మిగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

also read బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

అమెరికాకు నష్టం కలిగేలా ఇరాన్‌ ఎదురుదాడకి దిగితే తాము తగు విధంగా అధునాత ఆయుధాలతో సమాధానం చెబుతామని ట్రంప్‌ హెచ్చరించారు.మరోవైపు ప్రతిగా ఇరాన్‌ స్పందిస్తూ తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తృత పరచనున్నట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలను కలవర పరిచింది.

దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం పెద్ద కుదుపునకు గురి అయ్యాయి. దాదాపు అన్ని దేశాల స్టాక్‌మార్కెట్లు నష్టాలలోనే మిగిలాయి. ప్రపంచ దేశాల మార్కెట్ల బాటలోనే ఇటు దేశీయ మార్కెట్లు కూడా భారీ నష్టాలను నమోదు చేశాయి. యుద్ధ భయాలతో దేశీయ మార్కెట్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. ఫలితంగా సూచీలు కుప్పకూలాయి.

Market erases early gains; Sensex up 250 points, Nifty above 12,000

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ పరిణామాల నడుమ నేటి సెషన్‌ను నష్టాలతో ప్రారంభించిన సూచీలు అంతకంతకూ దిగజారుతూ వచ్చాయి. 300 పాయింట్లకు పైగా నష్టంతో ఆరంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 850 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు 788 పాయింట్లు దిగజారి 40,677 వద్ద స్థిరపడింది. 

అటు నిఫ్టీ కూడా 234 పాయింట్ల నష్టంతో 11,993 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో నిఫ్టీ బ్యాంక్‌ 898 పాయింట్లకు పతనమై మదుపరులతో కంటతడి పెట్టించింది. 2015 ఆగస్టు తర్వాత నిఫ్టీ ఇంత భారీగా పడిపోవడం మళ్లీ ఇప్పుడే. సోమవారం నాటి నష్టాలను కలుపుకుంటే గత రెండు సెషన్లలో సెన్సెక్స్‌ దాదాపు 1000 పాయింట్లను కోల్పోయినట్లయింది. 

ఈ సూచీ గత శుక్రవారం 162 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ షేర్లు కుదేలయ్యాయి. హాంగ్‌కాంగ్‌, ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి సూచీలే వేగంగా పడిపోయాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి దాదాపు 3లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. 

అంటే మూడుగంటల్లో రూ. 3 లక్షల కోట్ల మేర సంపదను మదుపురులు నష్టపోయారని చెప్పొచ్చు. కాగా మధ్యాహ్నం 2.30 సమయానికి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 154 లక్షల కోట్లకు దిగజారింది. గత శుక్రవారం ఈ విలువ రూ. 157 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉంది. ప్రతి ఐదు షేర్లలో నాలుగు నష్టపోగా, 229 స్మాల్‌ క్యాప్స్‌ ఎక్కువగా నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం. 

Market erases early gains; Sensex up 250 points, Nifty above 12,000

సెన్సెక్స్‌లో టైటాన్‌, పవర్‌గ్రిడ్‌ స్టాక్‌లు తప్ప మిగతా 29 స్టాక్స్‌ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్‌ విస్తృతి పూర్తి ప్రతికూలంగా నమోదైంది. బ్యాంకింగ్‌ రంగ సూచీ దారుణంగా పడిపోయింది. మార్కెట్లో విమానయాన సంస్థ స్టాక్‌ దాదాపు 3 శాతం మేర పడిపోయాయి. ప్రధానంగా ఇండిగో సంస్థ స్టాక్స్‌ దాదాపు 3 శాతం మేర పడిపోయి రూ.1,329.50కు కుంగాయి. క్రూడ్‌ దెబ్బతో డాలర్‌ పుంజుకోగా, దేశీయ కరెన్సీ బలహీనపడింది. డాలరు మారకంలో రూపాయి మరోసారి 72 స్థాయికి చేరింది.

ఇరాన్‌ ఖుద్స్‌ఫోర్స్‌ జనరల్‌ ఖాసీం సులేమానిను అమెరికా డ్రోన్లు దాడి చేసి చంపేయడంతో మధ్యప్రాచ్యం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ దాడితో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో భారత్‌ ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులు కనిపి స్తున్నాయి. ఎందుకంటే భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. మనకంటే ముందు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి. వీటికి చమురు సరఫరా చేసే మార్గాలు చాలా ఉన్నాయి. 

దేశీయ అవసరాల కోసం భారత్‌ 80శాతం చమురును, 40శాతం సహజవాయువును దిగుమతి చేసుకొంటున్నాము. భారత్‌ చుట్టు పక్కల ఎక్కడా చమురు సరఫరా చేసే దేశాలే లేవు.. సమీపంలో ఉన్న ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇరాక్‌, సౌదీ అరేబియాలపై ఎక్కువగా ఆధార పడుతోంది. వీటిల్లో ఇరాక్‌లో కూడా ఇప్పుడు సంక్షోభ పరిస్థితి నెలకొంది. 

also read బంగారం ధరలు భయపెడుతున్నాయి....రికార్డు స్థాయికి పది గ్రాముల పసిడి ధర

ఇక సౌదీ చమురు సరఫరా చేయాలంటే హర్మూజ్‌ జలసంధి ఒక్కటే ఏకైక మార్గం అది దాటాలంటే ఇరాన్‌ను దాటాల్సిందే. దీంతో చమురు రేట్లకు రెక్కలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో  ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్‌క్రూడ్‌ 70 డాలర్లను చేరడంతో రూపాయి కూడా బలహీననడింది.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుగా ముడి చమురు ధర  75 డాలర్లను చేరవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్‌ స్పందన తీవ్రంగా ఉంటే ప్రపంచ క్రూడ్‌ సరఫరాలో 20% మేర దెబ్బతిం టుందనీ, దీంతో క్రూడాయిల్‌ ధర 20% మేర పెరగవచ్చని అంతర్జాతీయ నిపుణుడు జోనాథన్‌ బరాత్‌ విశ్లేషించారు.

ఇదే జరిగితే దేశంలో పెట్రో మంటలు మరోసారి ఎగిసిపడే అవకాశాలు కనిపిస్తాయి.ఫలితంగా రవాణా వ్యయం పెరిగి దేశంలో ధరలు మరోసారి పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలే మందగమన పరిస్థితులకు తోడు ఇప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం దారుణంగా ఉంటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios