Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి మహీంద్రా ‘మహా బొలెరో’

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లోకి ‘మహా బొలెరో’ అప్ డేటెడ్ వెహికల్‌ను విడుదల చేసింది. ఇంధన ధరల ప్రభావం ఉన్నా.. ఈ ఏడాది విక్రయాల్లో 15 శాతం పురోగతి సాధిస్తుందని సంస్థ ఆటోమోటివ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మహేశ్ కులకర్ణి తెలిపారు.

Mahindra & Mahendra rolls out upgraded Bolero pickup
Author
Hyderabad, First Published Oct 13, 2018, 10:24 AM IST

హైదరాబాద్: ఇంధన ధరల పెరుగుదల ప్రభావం చూపినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం విక్రయాలు పెరుగుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు మహేశ్ కులకర్ణి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వాణిజ్య వాహనాల కొనుగోళ్ల మీద ఇంధన ధరల ప్రభావం ఉంటుందని దీంతో అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశం లేకపోలేదని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు మహేశ్‌ కులకర్ణి అంగీకరించారు. దేశంలో ఏటా 2.20 లక్షల పికప్‌ వాహనాలు విక్రయమవుతున్నాయని.. వీటిల్లో మహీంద్రా వాటా 62 శాతం వరకు ఉంటుందని  తెలిపారు. 

60 శాతం అమ్మకాలు వ్యవసాయ, సర్వీసెస్‌ విభాగం నుంచి ఉంటాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ మార్కెట్‌లోకి ‘మహా బొలెరో’ వాహనాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. మహీంద్రా వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాల్లో 28 శాతం బొలెరో వాటా ఉంటుందని మహేశ్ కులకర్ణి అన్నారు.  1.3 నుంచి 1.7 టన్నుల వరకు 3 రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు రూ.6.68 లక్షల నుంచి రూ.6.90 లక్షల మధ్య ఉన్నాయి. 

గత ఆర్థిక సంవత్సరంలో 1.49 లక్షల వాహనాలను విక్రయించామన్న మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు మహేశ్ కులకర్ణి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సరంలో మాత్రం 12,600 యూనిట్లు మాత్రమే విక్రయించామని తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో 50 శాతం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉంటే, మిగతా సర్వీస్ రంగంలో ఉంటాయని వివరించారు. మహీంద్రా మహా బొలెరో వాహనం విక్రయాలు పొరుగు దేశాల్లోనూ సాగుతాయని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ సౌత్‌ హెడ్‌ మనోజ్‌ కుమార్‌ గుప్తా పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios