హైదరాబాద్‌, 05 అక్టోబర్‌ 2020 : వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌, సప్లయ్, రవాణా పరంగా నిర్వహణ సామర్థ్యం పరంగా ఖ్యాతి గడించిన, భారతదేశపు అతిపెద్ద 3పీఎల్ లాజిస్టిక్స్‌ ప్రదాత మహీంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ (ఎంఎల్‌ఎల్‌) ప్రస్తుత బిల్ట్‌–టు–సూట్‌ వేర్‌హౌసింగ్‌ సామర్థ్యానికి అదనంగా 7.5 లక్షల చదరపు అడుగుల ప్రాంగణాన్ని హైదరాబాద్‌, చెన్నైలలో విస్తరించింది.

ఈ సదుపాయాలను స్ధిరమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడంతో పాటుగా సౌకర్యవంతమైన మరియు విస్తృత స్థాయి ఫుల్‌ఫిల్‌మెంట్‌, సమగ్రమైన పంపిణీ పరిష్కారాలను అందించడం కోసం అభివృద్ధి చేశారు.

ఈ సైట్ల మొదటి దశ ప్రధానంగా ఈ–కామర్స్‌, కన్స్యూమర్‌, ఇంజినీరింగ్‌ పరిశ్రమల కోసం సమగ్రమైన పరిష్కారాలను అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అదనంగా రాబోతున్న పండుగ సీజన్‌లో గణనీయంగా వృద్ధి చెందే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్‌ఎల్‌ ఇప్పుడు దాదాపు 10 లక్షల చదరపు అడుగుల ఫ్లెక్స్‌ వేర్‌హౌసింగ్‌ పరిష్కారాలను  వినియోగదారులకు మద్దతునందించేందుకు ఏర్పాటుచేసింది.
కరోనా మహమ్మారి సమయంలో భారీ ఫార్మా కంపెనీలకు సైతం చెప్పుకో తగ్గ పరిమాణంలో ప్రాంగణాన్ని కేటాయించారు. భారతదేశవ్యాప్తంగా ఫార్మా క్లయింట్స్‌కు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కోవిడ్‌  వ్యాక్సిన్‌ అవసరాలను తీర్చేందుకు ఎంఎల్‌ఎల్‌ ఇప్పటికే డెలివరీ రోడ్‌మ్యాప్‌తో సిద్ధమైంది. 

శ్రీ రామ్‌ప్రవీణ్‌ స్వామినాథన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో, మహీంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘మహీంద్రా వ్యాపారాన్ని సైతం వృద్ధి చేయడంలో మా ప్రయత్నాలను కొనసాగిస్తూ, ఎంఎల్‌ఎల్‌ ఇప్పుడు వేర్‌హౌసింగ్‌ సామర్థ్యం వృద్ధి చేయడంతో పాటుగా అన్ని ప్రాంతాల్లోనూ  వేర్‌హౌసింగ్‌ రంగంలో ఉన్న భారీ అవకాశాలపై దృష్టిసారించింది.

ఈ భారీ ప్రాంగణాలను ప్రారంభించడం ద్వారా ప్రస్తుత, సంభావ్య వినియోగదారుల వ్యాపారాభివృద్ధికి ఈ ప్రాంతాలలో తోడ్పడేందుకు ప్రయత్నిస్తున్నాం.  నూతన పరిష్కారాలైనటువంటి రిటర్న్స్‌ ప్రాసెసింగ్‌, పాపప్‌ సార్ట్‌ కేంద్రాలు, సమగ్రమైన పంపిణీ సేవలను మా ఖాతాదారులకు అందించడంపై అధికంగా దృష్టి సారించాం’’ అని అన్నారు. For more information, visit www.mahindralogistics.com