Asianet News Telugu

కాస్టీ డైవర్స్ సెటిల్మెంట్.. రూ.2.62 లక్షల కోట్లపై చిలుకే

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ బెజోస్‌కు విడాకుల భరణం రూ.2.62 లక్షల కోట్ల పై మాటే. ఇది ప్రపంచంలోనే భారీ విడాకుల పరిష్కార కేసుగా రికార్డుగా నిలువనున్నది.

MacKenzie Bezos, wife of Amazon founder, to get $38 billion in world's biggest divorce settlement
Author
Washington D.C., First Published Jul 3, 2019, 10:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాషింగ్టన్: భార్యాభర్తలు విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వడం మామూలే. అదీ కూడా ఐదో, పదో లక్షలు ఇవ్వడం సర్వ సాధారణం. మరికొన్ని కేసుల్లో ఈ మొత్తం ఐదు నుంచి పది కోట్ల వరకు ఉండొచ్చు. ఇంకొన్ని సంపన్న కేసుల్లో మరింత ఎక్కువ కావచ్చు. కానీ ఏకంగా రూ.2.62 లక్షల కోట్లకుపైగా భరణం రావడం ఎప్పుడైనా చూశామా. కానీ ఇది నిజం. ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ అధినేత దంపతుల మధ్య ఈ పరిష్కారం జరిగింది మరి. 

 

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ (55) దంపతులు విడాకులు తీసుకున్నారు. దీంతో భార్య మెకెంజీ బెజోస్ (49)కు సుమారు 38 బిలియన్ డాలర్లను విడాకుల సమస్య పరిష్కారం కింద జెఫ్ బెజోస్ ఇవ్వనున్నారు. ఈ మొత్తం మన కరెన్సీలో చూస్తే రూ.2,62,048 కోట్లు. 

 

26 ఏళ్లపాటు వైవాహిక జీవనం సాగించిన జెఫ్, మెకెంజీ దంపతులు విడిపోవాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. 1993లో వీరి వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలున్నారు. కాగా, విడాకుల నేపథ్యంలో అమెజాన్‌లో ఈ జంటకున్న షేర్లలో 25 శాతం మెకెంజీకి వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో వీటి విలువ దాదాపు 38 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 

 

ఇదిలావుంటే భార్యకు ఇంత భారీ మొత్తంలో భరణంగా వెళ్లినా.. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోసే ప్రథముడని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతున్నది. ఇప్పటికీ జెఫ్ నికర సంపద 118 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నది. 1992లో సీటెల్‌లోని తన గ్యారేజీ నుంచి అమెజాన్ కార్యకలాపాలను జెఫ్ ప్రారంభించారు. 

 

ఇది కాలక్రమేణా పెరిగి పెద్దదై.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ సంస్థగా ఎదిగింది. విడాకుల నిర్ణయం సమయంలో 90 రోజుల్లోగా మెకెంజీకి 38 బిలియన్ డాలర్లను ఇస్తానని జెఫ్ ప్రకటించిన సంగతి విదితమే. దీంతో ఈ వారంలో ఆ సొమ్ము మెకెంజీ చేతికి రానుండగా, ఇందులో సగభాగం సంపదను విరాళంగా ప్రకటించినదీ తెలిసిందే.

 

వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ఛారిటీ సంస్థకు ఈ సొమ్ము వెళ్తున్నది. రచయిత కూడా అయిన మెకంజీ ప్రపంచంలోని కుబేరుల్లో నాలుగో మహిళ కానున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన అమెజాన్ దంపతులు ఒక ఫైనాన్సియల్ డిస్‌క్లోజర్ ‌లో ప్రకటించిన మేరకు 90 రోజుల గడువు ఈ వారంలో ముగియనున్నది. 

 

ప్రస్తుతం అమెజాన్ సంస్థలో తక్కువ షేర్లు ఉన్నా సంస్థపై నియంత్రణ హక్కులను జెఫ్ బెజోస్ కోల్పోవడం లేదు. దీనికీ కారణం ఉంది. తన జీవిత భాగస్వామి అనుకున్న జెఫ్ బెజోస్ విడిపోయిన తర్వాత అమెజాన్ సంస్థలో తన నాలుగు శాతం వాటా హక్కులను తనకు అక్కర్లేదని తేల్చేశారు.

 

మెకంజీ బెజోస్. అందుకు స్వచ్ఛందంగా తన వాటాను జెఫ్ బెజోస్ వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఒరిజిన్ సంస్థల్లో వాటాలను, అమెజాన్ సంస్థలో 75 శాతం వాటాలను, ఓటింగ్ హక్కులను జెఫ్ బెజోస్‌కే వదిలేస్తున్నట్లు తెలిపారు. 

 

తొలుత ఈ జంట విడిపోనున్నట్లు జనవరిలోనే వెల్లడించారు. తనను మోసగించిన జెఫ్ బెజోస్ తో కలిసి ఉండలేనని మెకంజీ చెప్పారు. కానీ తర్వాత అదంతా వట్టిదేనని వివరణ ఇచ్చినా.. ఏప్రిల్ ఒకటో తేదీ ప్రకటనతో జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్ విడిపోవడం ఖాయమని తేలిపోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios