అదరగొట్టిన ఎం&ఎం షేర్లు.. ఒక్క రోజులో 7వేల కోట్లకు పైగా లాభం..
శుక్రవారం నాడు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ 2023-24 జూన్ త్రైమాసికానికి ట్యాక్స్ తర్వాత ఏకీకృత లాభం 56.04 శాతం పెరిగి రూ. 3,683.87 కోట్లుగా నమోదైంది, ఇది దాని ఆటోమోటివ్ సెగ్మెంట్ బలమైన పనితీరుపై ఆధారపడింది.
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ షేర్లు సోమవారం 4 శాతానికి పైగా పెరిగాయి. బిఎస్‌ఇలో ఈ షేరు 4.21 శాతం పెరిగి రూ.1,526.75 వద్ద స్థిరపడింది. రోజులో 4.47 శాతం పుంజుకుని రూ.1,530.65కి చేరుకుంది. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ కంపెనీలలో ఇది అధికంగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో 4.32 శాతం పెరిగి రూ.1,528 వద్ద ముగిసింది.
కంపెనీ రూ. 7,672.57 కోట్లను జోడించి మార్కెట్ వాల్యూని రూ. 1,89,855.76 కోట్లకు చేర్చింది. వాల్యూమ్ పరంగా రోజులో కంపెనీకి చెందిన 3.13 లక్షల షేర్లు బిఎస్‌ఇలో, 92.57 లక్షల షేర్లు ఎన్‌ఎస్‌ఇలో ట్రేడయ్యాయి.
శుక్రవారం నాడు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ 2023-24 జూన్ త్రైమాసికానికి ట్యాక్స్ తర్వాత ఏకీకృత లాభం 56.04 శాతం పెరిగి రూ. 3,683.87 కోట్లుగా నమోదైంది, ఇది దాని ఆటోమోటివ్ సెగ్మెంట్ బలమైన పనితీరుపై ఆధారపడింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 2,360.70 కోట్ల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్జించిందని మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ. 28,412.38 కోట్లతో పోలిస్తే రూ. 33,406.44 కోట్లుగా ఉంది, ఇది 17.57 శాతం పెరిగింది. మొత్తం ఖర్చులు ఏడాది క్రితం రూ.26,195.01 కోట్ల నుంచి రూ.30,492.08 కోట్లుగా ఉన్నాయి.