మీరు ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్‌ను ఫోన్ ద్వారా బుక్ చేస్తున్నారా.. రూ.500 క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటున్నారా.. అయితే పేటి‌ఎం ద్వారా ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే మీకు ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లను మొదటిసారి పేటిఎం ద్వారా బుకింగ్ చేస్తే 500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2020 వరకు అందుబాటులో ఉంటుంది. భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఈ పేటీఎం సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

మీరు ఇంతకు ముందు పేటి‌ఎం ద్వారా  ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే మీకు ప్రయోజనం లభించదు. మొదటిసారి పేటి‌ఎం ద్వారా  గ్యాస్ బుక్ చేసున్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. పేటి‌ఎం నుండి గ్యాస్ ఎలా బుక్ చెయ్యాలి ?

*మొదట పేటి‌ఎంలో రీఛార్జ్, పే బిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

* తరువాత మల్టీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, అందులో బుక్ ఎ సిలిండర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

also read విమాన ప్రయాణికులకు శుభవార్త: రద్దు చేసిన విమానా టికెట్ ఛార్జీలు జనవరి చివరిలోగా చెల్లింపు.. ...

* దీని తరువాత, మీరు గ్యాస్ ప్రొవైడర్‌ను ఎన్నుకోని, ఏజెన్సీలో రిజిస్టర్ నంబర్ లేదా ఎల్‌పిజి ఐడిని ఎంటర్ చేయాలి.

* అన్ని వివరాలను నమోదు చేసి, ప్రాసెసింగ్ ఆప్షన్ ఎంచుకోండి, ఆ తర్వాత మీ మొత్తం సమాచారం చూపిస్తుంది.

* చివరకు పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయండి. 

* గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక మీకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది

* గ్యాస్ బుక్ చేసేటప్పుడు ఈ ఆఫర్‌ పొందడానికి FIRSTLPG కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

* మీరు ప్రోమోకోడ్‌ను ఎంటర్ చేయకపోతే, మీకు గ్యాస్ సిలిండర్‌పై క్యాష్‌బ్యాక్ లభించదు.

* ఈ ప్రోమోకోడ్ పేటి‌ఎం ద్వారా చేసే గ్యాస్ బుకింగ్ మాత్రమే  చెల్లుతుంది.

* ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2020 వరకు చెల్లుతుంది, ఆ తర్వాత ఆ ఆఫర్ అందుబాటులో ఉండదు