Sukanya Samriddhi Account: సుకన్య సమృద్ధి ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందాలని చూస్తున్నారా..అయితే ఈ టిప్స్ మీ కోసం
మోడీ ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన ద్వారా మీరు పెద్ద మొత్తంలో లాభాలు పొందాలని అనుకుంటున్నారా..అయితే కింద పేర్కొన్నటువంటి టిప్స్ పాటించడం ద్వారా మీరు ఈ ప్రభుత్వం ద్వారా పెద్ద మొత్తంలో లాభాన్ని పొందే అవకాశం ఉంది.
ఆడపిల్లల ఆర్థిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాన్ని లక్షలాది మంది తల్లిదండ్రులు వినియోగించుకున్నారు. ఈ పథకం పోస్టాఫీసు , ప్రధాన బ్యాంకులచే ప్రజాదరణ పొందినప్పటికీ, కొన్ని ముఖ్యమైన అంశాలు , నియమాలు చాలా మందికి తెలియవు. అలాంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.
ఎక్కువ లాభం పొందాలనుకుంటే : ఎక్కువ లాభం పొందడానికి ప్రతి నెల 5వ తేదీలోపు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టండి. ప్రతి నెలా 1వ తేదీ తర్వాత , 5వ తేదీలోపు డబ్బు ఇన్వెస్ట్ చేస్తే, ఆ నెల వడ్డీని లెక్కించేటప్పుడు ఈ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చే నెలలో వడ్డీని లెక్కించేటప్పుడు ఐదవ తేదీ తర్వాత పెట్టుబడి పెట్టబడిన మొత్తం పరిగణించబడుతుంది. కాబట్టి సుకన్య సమృద్ధి ఖాతాలో వీలైనంత వరకు నెల 5వ తేదీలోపు పెట్టుబడి పెట్టండి.
రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవాలంటే ఏం చేయాలి : నిబంధనల ప్రకారం సుకన్య సమృద్ధి యోజన కింద గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు. కానీ మీకు కవలలు లేదా ట్రిప్లెట్స్ పిల్లలు ఉన్నట్లయితే, రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవడానికి చట్టం మిమ్మల్ని అనుమతిస్తుంది.
పెట్టుబడి కాలానికి పరిమితి ఉంది: సుకన్య సమృద్ధి యోజన కింద పెట్టుబడి గరిష్టంగా 15 సంవత్సరాలు మాత్రమే అనుమతించబడుతుంది. ఖాతాలో పెట్టుబడిని ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఏ కారణం చేతనైనా డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడరు.
మెచ్యూరిటీ పొందడానికి రెండు దశలు: సుకన్య సమృద్ధి ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి, ఖాతాదారుడి కుమార్తె వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. కూతురికి 18 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేసే పరిస్థితి ఉంటే అప్పుడు కూడా డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది.
విత్ డ్రా నియమాలు : ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండినప్పుడు సుకన్య సమృద్ధి ఖాతాలో పెట్టుబడి మొత్తంలో 50% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్ల 10వ తరగతి పాసైన తర్వాత కూడా 50% డబ్బులు అందించారు.
సుకన్య సమృద్ధి ఖాతా రద్దు అవుతుంది : సుకన్య సమృద్ధి ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టకపోతే అది నాన్ కరెంట్ ఖాతా అవుతుంది. 15 ఏళ్లలోపు ఖాతాను తాత్కాలికంగా మూసివేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంది. మీ ఖాతా ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా లేకుంటే, రూ. 50 జరిమానా చెల్లించి ఖాతాను యాక్టివ్‌గా తీసుకురావచ్చు.
ప్రతి 3 నెలలకు వడ్డీ రేటు మార్పు: సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటు మారుతుంది. 2015లో సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 9.2 శాతం. ఇప్పుడు వడ్డీ రేటు 7.6%. మీరు పొందే వడ్డీ రేటు ఆధారంగా మీ డివిడెండ్ చివరి మొత్తం నిర్ణయిస్తారు.