పండగకు కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే వీయూ కంపెనీ నుంచి కొత్త టీవీ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా టీవీ బ్రాండ్ Vu భారతదేశంలో తన కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ Vu గ్లో LED ని విడుదల చేసింది. 

Vu Glo LED స్మార్ట్ TV మూడు సైజుల్లో ప్రారంభించింది. 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ రేంజులో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 35,999గా నిర్ణయించారు. Vu Glo LED అన్ని మోడళ్లలో డాల్బీ విజన్‌ సపోర్ట్ లభిస్తోంది. ఇది అల్ట్రా HD, HDRలకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గ్లో డిస్‌ప్లే ప్యానెల్‌ ద్వారా కస్టమర్ కు బెస్ట్ పిక్చర్ క్వాలిటీని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం..

Vu Glo LED స్మార్ట్ TV స్పెసిఫికేషన్లు
1. Vu Glo LED TV సిరీస్ మూడు స్మార్ట్ టీవీలు అల్ట్రా HD స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో ప్రత్యేకమైన గ్లో ప్యానెల్‌ ఉండటం విశేషం. ఈ కారణంగా కంపెనీ బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అందిస్తామని క్లెయిమ్ చేస్తోంది.
2. Vu Glo స్మార్ట్ TV 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజీని అందుబాటులో ఉంచింది. 
3. ఈ స్మార్ట్ టీవీ బ్రైట్‌నెస్ 400 నిట్స్, ఇది 104W సబ్ వూఫర్‌ను కలిగి ఉంది. అలాగే, HDR10 హై డైనమిక్ ఫార్మాట్‌ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
4. హ్యాండ్ ఫ్రీ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఈ టీవీలో అందుబాటులో ఉంది. ఈ టీవీలో అడ్వాన్స్ క్రికెట్ మోడ్, గేమ్‌ల కోసం ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఉన్నాయి.

భారతదేశంలో Vu గ్లో LED స్మార్ట్ టీవీ ధర
Vu Glo LED TV మూడు సైజులలో అందుబాటులో ఉంచింది. టీవీ సైజుల ప్రకారం ధరలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 35,999, 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 40,999, మూడో పరిమాణం అంటే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ రూ. 60,999కి అందుబాటులో ఉంది. సమాచారం ప్రకారం, Vu Glo LED సిరీస్ యొక్క 43-అంగుళాల స్మార్ట్ TV కూడా త్వరలో మార్కెట్లో లాంచ్ అవుతుందని ప్రకటించింది.. మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి అన్ని టీవీలను కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఇతర డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.