Asianet News TeluguAsianet News Telugu

లోన్ కోసం వెతుకుతున్నారా, అయితే SBI Yono App ద్వారా లోన్ తీసుకుంటే బంపర్ ఆఫర్..ఏంటో చెక్ చేసుకోండి..

SBI Yono App ద్వారా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీరు లోన్ పొందే వీలుంది. 

Looking for a loan but if you take a loan through SBI Yono App check out the bumper offer
Author
First Published Oct 6, 2022, 7:04 PM IST

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం పెద్ద ప్రకటన చేసింది. మీరు SBI కస్టమర్ అయితే  పండుగ సీజన్‌లో పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, బ్యాంక్ మీ కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము లేకుండా,  తక్కువ వడ్డీ రేట్లతో SBI లోన్‌లను పొందవచ్చు.

ఇటీవల, స్టేట్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి లోనుపై ఆఫర్ గురించి ట్వీట్ చేసింది. “ఈ పండుగ సీజన్‌ను SBIతో జరుపుకోండి  మీ ప్రియమైనవారితో ఆనందించండి. జీరో ప్రాసెసింగ్ ఫీజులు, కార్ లోన్ల పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, వ్యక్తిగత  బంగారు రుణాలు వంటి ప్రత్యేక ఆఫర్‌లను పొందండి, ఇప్పుడే YONO SBI యాప్‌లో దరఖాస్తు చేసుకోండి లేదా bank.sbiని సందర్శించండి.”

Sbi yono app ద్వారా ఆన్లైన్ ద్వారానే లోన్స్ పొందవచ్చు.  ముఖ్యంగా కార్ లోన్స్,  పర్సనల్ లోన్స్,  హోమ్ లోన్,  గోల్డ్ లోన్ వంటివి ఎలాంటి  పేపర్ డాక్యుమెంట్స్ లేకుండానే, ఆన్ లైన్  బ్యాంకింగ ద్వారా పొందవచ్చు. మీరు yono app ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  ఈ అప్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే బీమా సౌకర్యం కూడా పొందే వీలుంది పలు ఈ కామర్స్ సైట్స్ అందించే ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఉత్సవ్ డిపాజిట్ పథకం అక్టోబర్ 28, 2022 వరకు అందుబాటులో ఉంది..
అదే సమయంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవ్ డిపాజిట్ అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరు 75 రోజుల పాటు డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా ఈ ప్రత్యేక FD పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 28, 2022 వరకు ఉంటుంది. డిపాజిట్ వ్యవధి 1000 రోజులు. ఉత్సవ్ FD పథకంలో, SBI 1,000 రోజుల డిపాజిట్లపై సంవత్సరానికి 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios