పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బ్రిటన్‌ పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారికి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు కొట్టేసింది.

లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నీరవ్‌మోడీకి బెయిల్‌ను తిరస్కరించింది. ఆయన బెయిల్ దరఖాస్తును అక్కడి కోర్టు కొట్టివేయడం ఇది నాలుగోసారి. బెయిల్ మంజూరు చేస్తే ఆయన తప్పించుకుని తిరిగే అవకాశాలున్నాయని ప్రాసిక్యూషన్ వాదించడంతో న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను పక్కనబెట్టింది.