ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో దేశీయ మార్కెట్లు గురువారం జోరు మీదున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి అంతర్గత ట్రేడింగ్ లో 10.30 గంటలకు 40వేల మార్కును దాటింది. 

మరోసారి ఎన్డీయే సర్కార్‌ వస్తుందనే అంచనాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. 500 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం దాదాపు 600 పాయింట్ల వరకు ఎగబాకింది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 595 పాయింట్లు లాభపడి 39,705 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,907 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.44గా కొనసాగుతోంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేర్లు దాదాపు 5శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఎనర్జీ, లోహ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు రాణిస్తున్నాయి.

ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 12వేలు దాటింది. నిఫ్టీలో బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ ఇండెక్స్ 1000 పాయింట్లు దాటింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, పీఎన్బీ; సిండికేట్ బ్యాంకు షేర్లు 5.5-12 శాతం పెరిగాయి. ప్రారంభంలోనే బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 10,012 పాయింట్ల రికార్డు లీడ్‌తో ట్రేడింగ్ మొదలైంది. సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లబ్ది పొందిన షేర్లు