రోజుకి రూ. 200 సేవ్ చేస్తే చాలు 28 లక్షలు గ్యారంటీ.. ఈ సూపర్ ప్లాన్ ఏంటో తెలుసా?
LIC జీవన్ ప్రగతి పథకంలో పెట్టుబడిదారులకు ప్రతి ఐదేళ్లకు రిస్క్ కవర్ పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే బీమా మొత్తం నామినికి చెల్లించబడుతుంది.
భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ చేయడం అన్నది ప్రతి ఒక్కరూ చేసే పని. చాల మంది వారి సంపాదనను చాలా వరకు ఆదా చేసుకోవాలనుకుంటున్నారు. దీని కోసం అనేక రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్‌ఐసీ. LIC, భారతదేశపు అతిపెద్ద బీమా(insurance) సంస్థ, వివిధ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో జీవన్ ప్రగతి పాలసీ చాలా మందికి ఉపయోగపడుతుంది. LIC జీవన్ ప్రగతి పథకంలో పెట్టుబడిదారులకు ప్రతి ఐదేళ్లకు రిస్క్ కవర్ పెరుగుతుంది.
ఒక పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే బీమా మొత్తం చెల్లించబడుతుంది. జీవన్ ప్రగతి పాలసీ కాలపరిమితి కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 20 సంవత్సరాలు. 12 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పాలసీలో కనీస మొత్తం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 2 లక్షల పాలసీ... వారి డెత్ బెనిఫిట్ మొదటి ఐదేళ్ల వరకు సాధారణం.
6 నుండి 10 సంవత్సరాల తర్వాత కవరేజీ రూ. 2.5 లక్షలు. 10 నుండి 15 సంవత్సరాలలో కవరేజీ రూ. 3 లక్షలు పెరుగుతుంది. ఈ పథకంలో ఒక వ్యక్తి రోజుకు రూ.200 ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. అంటే మొత్తంగా నెలకు రూ. 6000 పెట్టుబడి పెట్టాలి. ఇలా డిపాజిట్ చేస్తూనే ఏడాదికి రూ. 72,000 పెట్టుబడి పెట్టాలి. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం పెట్టుబడి రూ. 14,40,000 అవుతుంది. దింతో పాటు కవరేజీ అన్నీ కలిపి మీకు మొత్తం రూ. 28 లక్షలు అందుబాటులో ఉంటాయి.