Asianet News TeluguAsianet News Telugu

మీరు ఉద్యోగా.. ఫ్యూచర్ లో పెన్షన్ కోసం టెన్షన్ పడుతున్నారా.. అయితే ఎల్ఐసీ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కొత్త నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్-లింక్డ్, ఇండివిడ్యువల్ పెన్షన్ ప్లాన్, న్యూ పెన్షన్ ప్లస్, సెప్టెంబర్ 5 నుండి ప్రారంభించింది. ఇది పాలసీదారునికి క్రమశిక్షణతో పొదుపు చేయడంలో సహాయపడుతుంది. టర్మ్ పూర్తయిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ద్వారా దీన్ని సాధారణ ఆదాయంగా మార్చుకోవచ్చు.

LIC New Pension Plus Plan here are the details
Author
First Published Sep 7, 2022, 10:52 AM IST

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించడం సహజం. ఉద్యోగం అనంతరం జీవితంలో ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోక పోతే చాలా కష్టాలు పడతాం. క్రమశిక్షణతో మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేస్తే అది రేపటి భవిష్యత్తుకు ఆసరా అవుతుంది. నేటి తరం ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) సెప్టెంబర్ 5న 'LIC New Pension Plus Plan' పేరుతో వ్యక్తిగత పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం పాలసీదారులకు క్రమబద్ధంగా, క్రమశిక్షణతో పొదుపు చేయడానికి సహాయపడుతుంది. మీరు టర్మ్ ముగింపులో యాన్యుటీ ప్లాన్‌ని కొనుగోలు చేయడం ద్వారా మీరు చేేసే కాస్త పొదుపును మీ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌ను ఒకే ప్రీమియం చెల్లింపు పాలసీగా లేదా సాధారణ ప్రీమియం చెల్లింపు పాలసీగా ఎంచుకోవచ్చు. పాలసీ వ్యవధిలో సాధారణ చెల్లింపు ఎంపిక కింద ప్రీమియం చెల్లించవచ్చు. పాలసీదారు కనీస, గరిష్ట ప్రీమియం పరిమితి, పాలసీ టర్మ్, వయస్సు ఆధారంగా ప్రీమియం మొత్తాన్ని  పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. 

ఈ పాలసీలో, పాలసీదారు నాలుగు రకాల ఫండ్‌లలో  ప్రీమియం ద్వారా పెట్టుబడి పెట్టడానికి వీలుంది. ఇంకా ఈ పాలసీలో పేర్కొన్న అదనపు హామీ మొత్తం పాలసీదారుకు కూడా చెల్లించబడుతుంది. ఇది వార్షిక ప్రీమియం శాతంగా ఇవ్వబడుతుంది. అంటే సాధారణ ప్రీమియం ఎంచుకునే వారికి ఇది 5.0-15.5% ఉంటుంది. ఇప్పుడు, సింగిల్ ప్రీమియం చెల్లింపు మోడ్ కోసం పాలసీ  నిర్దిష్ట వ్యవధి పూర్తయిన తర్వాత అదనంగా 5% చెల్లించబడుతుంది. 

ఇదిలా ఉంటే భారతదేశపు అతిపెద్ద IPOగా గుర్తింపు పొందిన LIC IPOకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఆరు రోజుల బిడ్డింగ్ ముగిసే సమయానికి ఎల్‌ఐసి షేర్లు 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. షేర్లు అత్యధిక ధరల శ్రేణికి విక్రయించబడ్డాయి.  ఇన్వెస్టర్ల  నుండి భారీ డిమాండ్ ఉంది. 16.2 కోట్ల ఈక్విటీ షేర్ల పరిమాణంతో IPO కోసం 47.83 కోట్ల బిడ్‌లు సమర్పించబడ్డాయి. ఎల్‌ఐసీ ఐపీఓలో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.949గా నిర్ణయించారు. అయితే, పాలసీదారు ఒక్కో షేరుపై రూ.60 పొందుతారు.  రిటైల్ ఇన్వెస్టర్లు, LIC ఉద్యోగులకు ఒక్కో షేరుకు 45. రాయితీ ఇచ్చారు.

మంగళవారం (సెప్టెంబర్ 6) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో ఎల్‌ఐసి ఒక్కో షేరు రూ.653.10 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి రోజుతో పోలిస్తే. 0.99 శాతం తగ్గుదల నమోదైంది.ఎల్‌ఐసీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,53,721.92 లక్షల కోట్లుగా ఉంది. మేలో లిస్టింగ్ రోజున, ఎల్ఐసి విలువ ప్రకారం ఐదవ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. మంగళవారం బిఎస్‌ఇలో ఎల్‌ఐసి 8.61 శాతం తగ్గింపుతో ఒక్కో షేరుపై రూ.867.20కి ప్రారంభమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios