LIC IPO: ప్రభుత్వ బీమా కంపెనీ LIC IPOకు మార్కెట్‌లో మంచి స్పందన వస్తోంది. ఈ IPO రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడనప్పటికీ, ఇది సోమవారం (మే 02) నుండి యాంకర్ ఇన్వెస్టర్ల కోసం తెరిచి ఉంచారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా LIC IPO అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ IPOలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగం మొదటి రోజునే ఓపర్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ విధంగా, LIC IPO ఇతర పెట్టుబడిదారులకు తెరవకముందే దాదాపు 5,620 కోట్ల రూపాయలను సేకరించింది.
LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఆఫర్ (ఐపిఓ) రేపటి నుంచి ( మే 4) సాధారణ ఇన్వెస్టర్లు సైతం అప్లై చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఎల్‌ఐసీ ఐపీఓపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఐసీ ఐపీఓ పనులతో సంబంధం ఉన్న బ్యాంకుల ఉద్యోగులను మే 15 వరకు బదిలీ చేయరాదని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. LIC IPO 4 మే నుంచి 9 మే 2022 వరకు బిడ్డింగ్ కోసం తెరిచి ఉంచుతారు. భారత ప్రభుత్వం LIC IPO యొక్క ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 902 నుండి రూ. 949కి నిర్ణయించింది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన
ఎల్‌ఐసీ ఐపీఓకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,620 కోట్ల సబ్ స్క్రిప్షన్ పొందింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిన గరిష్ట షేర్లు రూ. 5,620 కోట్లు అని ఓ అధికారి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఈ విభాగంలో IPO ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎల్‌ఐసి IPO ఇతర పెట్టుబడిదారుల కోసం రేపటి నుంచి తెరిచి ఉంచుతారు.
ఈ యాంకర్ ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేశారు
LIC యాంకర్ ఇన్వెస్టర్లలో ICICI ప్రుడెన్షియల్ (ICICI Prudential), SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ (SBI Equity Hybrid Fund), SBI బ్లూ చిప్ ఫండ్ (SBI Blue chip fund), HDFC హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ (HDFC Hybrid equity fund), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ (Aditya Birla Sun Life), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund), HCL కార్పొరేషన్ (HCL Corporation), SBI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (SBI Flexi cap fund), నిప్పన్ లైఫ్ (Nippon Life), మహీంద్రా లైఫ్ (Kotak Mahindra Life Insurance), ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ (Franklin India Flexi cap) వంటి కంపెనీలు ఉన్నాయి.
