ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దక్కడం లేదా అయితే ఇక ఆలస్యం చేయకండి  ఈ వ్యాపారం చేయడం ద్వారా సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి నెల చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం. 

సమ్మర్ వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం, మంచి సీజనల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే వెంటనే స్టార్ట్ చేసేయండి. తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి చల్లటి గోలి సోడా తాగితే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. రాను రాను కూల్ డ్రింక్స్ దెబ్బకు ప్రస్తుతం గోలి సోడా అనేది కరువైపోయింది. 

అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ గోలీ సోడా అనేది ఫేమస్ అవుతోంది. జనం కూడా గోలి సోడాను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ప్రస్తుతం మార్కెట్లో గోలి సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్ షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా గోలి సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మీరు జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ గోలి సోడా షాపును ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 

Business Ideas: వేసవి వచ్చేస్తోంది, ఐస్‌క్రీం పార్లర్ వ్యాపారం ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే చాన్స్..

ప్రస్తుతం మార్కెట్లో గోలి సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తున్నారు. ఇవి అనేక రకాల ఫ్లేవర్లలో లభ్యం అవుతున్నాయి. ఒకప్పటి సాంప్రదాయ గోలి సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నేరుగా గోలి సోడా డీలర్షిప్ తీసుకొని వారి వద్ద నుంచి గోలి సోడా కార్టన్ లను తెచ్చుకొని విక్రయించవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

చదువుతో పనిలేదు, జస్ట్ రూ.11 వేలతో ఈ కోర్సు చేస్తే చాలు, మహిళలు ఇంట్లోనే నెలకు రూ. 1 లక్ష సంపాదించే చాన్స్..

అలాగే హోటల్స్ బేకరీ నాకు కూడా మీరు సప్లై చేయవచ్చు తద్వారా కూడా మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 

ఒక్కో గోలీ సోడా సీసా రూ. 30-40లకు విక్రయిస్తున్నారు. దీనిపై కమీషన్ రూ. 10 వరకూ లభించే అవకాశం ఉంది. ఈ లెక్క రోజుకు 200 సీసాలు అమ్మితే, మీరు రోజుకు రూ.2000 వరకూ సంపాదించవచ్చు. నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ సంపాదించవచ్చు.