Asianet News TeluguAsianet News Telugu

లే ఆఫ్ అలర్ట్.. ఖర్చులను తగ్గించుకోవడానికి 7000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న వాల్ట్ డిస్నీ సంస్థ..

ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా పిలిపించుకున్న వాల్ట్ డిస్నీ సైతం  ఉద్యోగుల తొలగింపునకు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేస్తోంది. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ గండం చుట్టుముట్టుకుంది.

Lay off alert Walt Disney is laying off 7000 employees to cut costs MKA
Author
First Published Feb 9, 2023, 5:24 PM IST

 ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను లే ఆఫ్ ప్రకటనలు కలవరానికి గురి చేస్తున్నాయి ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే మల్టీ నేషనల్ కంపెనీలో లే ఆఫ్ లను ప్రకటించి ఉద్యోగులను ఎలా పెడ విధుల నుంచి తొలగిస్తున్నాయి.  ఇప్పటికే ఆ కోవలోకి అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సంస్థలు వచ్చి చేరాయి అలాగే తాజాగా డిస్నీ సంస్థ సైతం ఉద్యోగులను తొలగించేందుకు రంగంలోకి దిగింది

ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించేందుకు వాల్ట్ డిస్నీ సిద్ధమైంది. వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు 5.5 బిలియన్ల ఖర్చు-పొదుపు ప్రయత్నంలో భాగంగా దాదాపు 7,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు డిస్నీ ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం డిస్నీ ప్రస్తుత వర్క్‌ఫోర్స్‌లో 3.6 శాతం మందిని తొలగిస్తోంది. 

కంపెనీ తన ప్రధాన బ్రాండ్‌లు ఫ్రాంచైజీలపై దృష్టి సారించినందున, వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ఖర్చులను తగ్గించడం కంటే వేరే మార్గం లేదని CEO బాబ్ ఇగెరిన్ పేర్కొన్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ నెల్సన్ పెల్ట్జ్ డిస్నీ స్ట్రీమింగ్‌పై ఎక్కువ ఖర్చు చేస్తున్నందుకు విమర్శించారు.

కొత్త ప్లాన్ ప్రకారం, డిస్నీ కంపెనీని మూడు విభాగాలుగా పునర్నిర్మించనుంది. మొదటిది ఫిల్మ్, టెలివిజన్, స్ట్రీమింగ్‌ను కవర్ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్, రెండవది స్పోర్ట్స్-ఫోకస్డ్ ESPN యూనిట్, మూడవది డిస్నీ పార్క్స్, టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ డానా వాల్డెన్, ఫిల్మ్ చీఫ్ అలాన్ బెర్గ్‌మాన్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి నాయకత్వం వహిస్తారు, జిమ్మీ పిటారో ప్రముఖ ESPN చానెల్ కు నాయకత్వం వహిస్తారు. 

టెక్నాలజీ . మీడియా రంగాలలో ప్రపంచ ఉద్యోగాల కోతల మధ్య డిస్నీతొలగింపులు భాగం అయ్యాయి.  ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ నేషనల్  కంపెనీలు భారీ స్థాయిలో కార్మికులను తొలగించాయి. గూగుల్ 12,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్ 18,000 ఉద్యోగాలను తొలగించింది. మెటా, ట్విట్టర్ రెండూ తొలగింపులు చేశాయి. షేర్‌చాట్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులను తొలగించింది. 

ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ నెమ్మదిగా తగ్గుతోందని నూతన రిక్రూట్మెంట్లకు అవకాశాలు పెరుగుతున్నాయని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా  ఆర్థిక మద్యం ప్రభావం నెమ్మదిగా తగ్గుతోందని,  దీనితో నూతనంగా రిక్రూట్మెంట్ను ప్రారంభిస్తున్నామని ప్రముఖ జాబ్  రిక్రూట్మెంట్ వెబ్సైట్లు చెబుతున్నాయి.  ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఇతర రంగాల్లో  ఉద్యోగాలకు అవకాశం  ఉందని  రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చెబుతున్నాయి.  హెల్త్ కేర్ రంగం టూరిజం రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోందని కరోనా తగుముఖం పట్టడంతో పర్యాటక రంగం పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు.

 అలాగే  ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు,  నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉద్యోగులకు ఏర్పడిందని,  అప్పుడు కొత్త తరహా ఈ రిక్రూట్ మెంట్లలో వారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios