కోల్‌కతా: కోటక్ మహీంద్రా బ్యాంక్ (కోటక్ బ్యాంక్ ) ఐ‌పి‌ఎల్ క్రికెట్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం తెలిపింది. డిజిటల్ పేమెంట్ పెంచడానికి క్రికెట్ థీమ్‌ డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రారంభించింది.

కరోనా వైరస్‌ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి.

also read అంతర్జాతీయ విమానాలలో జియో మొబైల్ సర్వీసేస్.. కాల్స్, డేటా ఫ్రీ.. ...

ఈ పండుగ సీజన్ లో అధిక ఖర్చుల కోసం ఈ కార్డుల వినియోగం ద్వారా ప్రీ-కోవిడ్ స్థాయి చేరుకుంటుంది అని ఒక అధికారిక ప్రతినిధి చెప్పారు. కోటక్  బ్యాంక్ మరో 5 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈ టీమ్ ల ద్వారా మై టీమ్ డెబిట్, క్రెడిట్ కార్డులను లాంచ్ చేసింది.

వారి అభిమాన క్రికెట్ టీమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రికెట్ థీమ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వంతం చేసుకోవడానికి కస్టమర్లు ఇండక్షన్ ఫీజుగా రూ.599 చెల్లించాల్సి ఉంటుంది, అయితే చెల్లించిన రూ.599కి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.