Asianet News TeluguAsianet News Telugu

అంబానీ క్రూయిజ్ పార్టీ.. సెలబ్రిటీల ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్ ఎంత వసూలు చేసాడంటే ?

జోసెఫ్ రాధిక్ ఇతనొక ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్. ప్రముఖ బాలీవుడ్ జంటల పెళ్లిళ్లను తన కెమెరాతో బంధించాడు. ఇప్పుడు అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫోటోలు తీయడానికి అతను ఎంత వసూలు చేశాడంటే ? 
 

know how much the celebrity photographer charged for Ananth Radhika's cruise party photo?-sak
Author
First Published Jun 17, 2024, 12:56 PM IST

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వీరేన్ మర్చంట్ & శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ తాజాగా  యూరప్‌లోని ఒక విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో సెకండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను జరుపుకున్నారు. ఈ జంట, ఫ్యామిలీ ఇంకా  ఫ్రెండ్స్  రియల్  టైంలో  క్రూజ్ షిప్‌ నుండి ఫోటోలను షేర్ చేసారు. దింతో ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

ప్రముఖుల వివాహాల ఫోటో కవరేజీకి జోసెఫ్ రాధిక్   పాపులర్  ఫోటోగ్రాఫర్. జోసెఫ్ రాధిక్ 6 సంవత్సరాలు ఇంజనీరింగ్ అండ్  మేనేజ్‌మెంట్ చదివాడు అలాగే  3 సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేశాడు. అయితే ఫోటోగ్రఫీ ఒక్కటే తనకు సంతోషాన్ని కలిగించిందని గ్రహించిన జోసెఫ్  2010లో అతను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వృత్తిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని  కూడా విడిచిపెట్టాడు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా మంది ప్రముఖుల వివాహ ఫోటోల వెనుక జోసెఫ్ రాధిక్ ఉన్నారు. అతను కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, KL రాహుల్-అతియా శెట్టిల వెడ్డింగ్  ఫోటోగ్రాఫర్ కూడా. 

జోసెఫ్ రాధిక్ రోజుకు రూ. 1,25,000 - రూ. 1,50,000 + ట్యాక్స్  ఛార్జ్ చేస్తాడు. ఇంకా ఫోటోగ్రఫీ చార్జెస్ తో  పాటు ప్రయాణ/వసతి  ఖర్చులు కూడా ఛార్జ్ చేస్తారు.

కాగా, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇప్పుడు వారి చిన్న కొడుకు వివాహ వేడుకలకు సిద్ధమవుతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జూలై 12న ముంబైలో జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios