Asianet News TeluguAsianet News Telugu

"కైండ్ ఆఫ్ డైనోసార్ మ్యూజియం": దశాబ్దాల నాటి గృహోపకరణాల వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంటర్నెట్ వైరల్..

ఈ వీడియోలో క్యాసెట్ టేపులు, లాంతర్లు, పాతకాలపు స్కూటర్ మోడల్‌లు, సబ్బులు వంటి వస్తువుల ఫోటోలు ఉన్నాయి. ఇంకా మొత్తం ఈ వీడియో క్లిప్‌లో 1956 సినిమా షిరిన్ ఫర్హాద్‌లోని పాట 'గుజ్రా హువా జమానా' ప్లే అవుతుంది.

Kind Of Dinosaur Museum: Anand Mahindra Shares Video Of Decades-Old Household Items
Author
First Published Jan 7, 2023, 12:05 PM IST

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో, ముఖ్యంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో బాగా పాపులరిటీ పొందారు. బిలియనీర్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచుగా వివిధ జనరేషన్లకు సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా కొన్ని దశాబ్దాల క్రితం వరకు ప్రసిద్ధి చెందిన గృహోపకరణాలు ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో క్యాసెట్ టేపులు, లాంతర్లు, పాతకాలపు స్కూటర్ మోడల్‌లు, సబ్బులు వంటి వస్తువుల ఫోటోలు ఉన్నాయి. మెమొరీ లేన్‌లో ఎంత గొప్ప ప్రయాణం! ఎవరైనా ఈ నిజమైన వస్తువులను సేకరించి మ్యూజియంలో ప్రదర్శిస్తే అద్భుతం ? కొన్ని జనరేషన్లు వాటిని చూసి ఆనందిస్తారని నేను భావిస్తున్నాను…ఒక రకమైన డైనోసార్ మ్యూజియం అని వ్యాపార దిగ్గజం ట్వీట్ లో పోస్ట్  చేశారు.

వీడియోలో పురాతన ల్యాండ్‌లైన్ ఫోన్, స్కూటర్, ఐరన్ బాక్స్, అనేక రకాల లాంతర్లు, పాతకాలపు అలారం గడియారం, పాత కిరోసిన్  స్టవ్ ఉన్నాయి. వీడియోలో క్యాసెట్‌లతో పాటు టేప్ రికార్డర్, టైప్‌రైటర్ అండ్ ట్రాన్సిస్టర్ రేడియో కూడా ఉన్నాయి. మొత్తం ఈ వీడియో క్లిప్‌లో 1956 సినిమా షిరిన్ ఫర్హాద్‌లోని పాట 'గుజ్రా హువా జమానా' ప్లే అవుతుంది.

అమితాబ్ బచ్చన్, మధుబాల ఇంకా ఇతర ప్రముఖులు నటించిన ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కవర్‌లు కూడా వీడియో క్లిప్‌లో ఉన్నాయి. చార్మినార్ వంటి బ్రాండ్‌ల సిగరెట్ ప్రకటనలలో  జాకీ ష్రాఫ్ ఉన్నారు. ఇంకా ఎవ్రి డే బ్యాటరీలు, పాండ్స్ టాల్కమ్ పౌడర్, కోల్గేట్ టూత్ పౌడర్, డాల్డా వనస్పతి ఇంకా రాజ్‌దూత్ DTS 175 బైక్ తో సహా పాతకాలపు ప్రకటనల ఉత్పత్తులు ఉన్నాయి.

చిత్రనిర్మాత అశోక్ పండిట్ ట్వీట్ చేస్తూ, "సార్ ఇవన్నీ చోర్ బజార్ & ఓషివారా మార్కెట్ (ముంబై)లో అందుబాటులో ఉన్నాయి. మేము మా షూట్‌ల కోసం ఇవన్నీ ఈ మార్కెట్‌ల నుంచే కొనుగోలు చేస్తాము." అని రిట్వీట్ చేశారు.

ఈ వీడియోకు 604.6K వ్యూస్, 10.7k లైక్‌లు వచ్చాయి. ఎప్పటిలాగే, ఇంటర్నెట్ యూజర్లు ఈ వీడియోని ఎంతో ఇష్టపడ్డారు. ఇంకా స్వంత అనుభవాలు అలాగే చమత్కారమైన కామెంట్స్ తో కామెంట్స్ విభాగాన్ని నింపారు. “నిజమే సార్! మీరు నా జ్ఞాపకాలను మళ్లీ పునరుజ్జీవింపజేసారు.. నా కళాశాల సమయంలో నా టైపింగ్ సర్టిఫికేట్‌లను పొందాను. కాలేజ్ పూర్తయ్యే సమయానికి, కంప్యూటర్‌లతో పని చేయడం ముగించాను" అని ఒక యూజర్ కామెంట్ రాశారు.

 "గొప్ప జ్ఞాపకాలు. అవి తక్కువ టెక్నాలజితో ఎక్కువ సౌకర్యవంతంగా ఉండే రోజులు. కానీ ఇప్పుడు  హైటెక్ నాలెడ్జ్ తో ఎక్కువ ఆందోళనలు. చల్నే దేవ్. చల్తీ కా నామ్ జిందగీ” అని మరొక యూజర్ కామెంట్ చేశారు. ఇంకోక యూజర్ “నోస్టాల్జిక్ అండ్ ఎవర్ గ్రీన్. అప్పటి కాలం  నిజంగా మన కొత్త తరం నమ్మడం కష్టం. ఈ వీడియో చూసినప్పుడు నాకు గూస్‌బంప్‌లు వచ్చాయి ఇంకా నన్ను ఆ పాత అద్భుతమైన కాలానికి తీసుకెళ్లాయి. ” అని పోస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios