Asianet News TeluguAsianet News Telugu

Kia Sonet: దసరాకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తన్నారా..అయితే 8 లక్షల లోపే లభించే కియా కారుపై ఓ లుక్ వేయండి

దసరా పండగ సందర్భంగా కొత్త కారు కొనే వారికి కియా నుంచి వస్తున్న సోనెట్ కారు మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ కారు ఇప్పటికే చక్కటి రివ్యూలను అందుకుంది. అంతేకాదు ఈ కారు తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది. 

Kia Sonet: Are you planning to buy a new car for Dussehra..but take a look at Kia under 8 lakhs MKA
Author
First Published Oct 13, 2023, 3:10 PM IST | Last Updated Oct 13, 2023, 3:10 PM IST

దసరా పండగ సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే కియా నుంచి అత్యంత సక్సెస్ రేట్ అందుకున్న కియా సోనెట్ పై ఓ లుక్కేయండి. ఈ కారు ఇప్పటి కే మంచి సేల్స్ అందుకుంది. అంతేకాదు ఈ కారు బడ్జెట్ ఫ్రెండ్లీలో లభించే ఎస్‌యూవీ కావడం విశేషం. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

5 సీట్ల పెద్ద బూట్ స్పేస్ ఉన్న కియా సోనెట్ కారు ప్రతి కుటుంబం డిమాండ్ తీర్చేలా డిజైన్ చేశారు. ఈ కారు అందుబాటు ధరలో లభించడంతో పాటు అధిక మైలేజీని అందిస్తుంది. రూ. 7.79 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లభించే ఈ కారు 18.4 kmpl అధిక మైలేజీని అందిస్తుంది. 

కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
కియాకు చెందిన ఈ కారులో 6-స్పీడ్, 7-స్పీడ్ అనే రెండు ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. ఈ కారులో ముందు, వెనుక ఒకటి రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కంపెనీ నుంచి లభిస్తున్న SUV కారు.. దీని టాప్ మోడల్ రూ. 10 లక్షలు కావడం విశేషం. ఈ కారు మార్కెట్లో టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV300 లకు పోటీగా ఉంది. కారు 16 అంగుళాల టైర్ సైజును కలిగి ఉంది.

కియా సోనెట్ కారు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ
కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ ఉంది. ఇది జారిపోయే సమయంలో కారును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, అకస్మాత్తుగా బ్రేకింగ్ లేదా టైర్ జారడం వంటి సందర్భాల్లో ఇది టైర్లను నియంత్రిస్తుంది. ఈ సిస్టమ్ సెన్సార్లలో స్వయంచాలకంగా పని చేస్తుంది. కారు 120 PS శక్తిని పొందుతుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 180 కి.మీ అందుకుంటుంది. 

కియా సోనెట్‌లో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తోంది. ఈ SUV కారులో 392 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులో ఎక్కువ లగేజీతో సుదూర మార్గాల్లో ప్రయాణించవచ్చు. కారులో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అందించబడింది. ఈ కారు 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కూల్ కారులో కంపెనీ డీజిల్ ఇంజన్ ఎంపికను కూడా కలిగి ఉంది.

కారులో 9 రంగు ఎంపికలు
ఈ కారులో కంపెనీ 9 కలర్ ఆప్షన్లను అందిస్తోంది. టర్బో ఇంజిన్ ఎంపిక కూడా ఇందులో ఉంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు కారులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios