Asianet News TeluguAsianet News Telugu

కియోది ఇక ఫుల్ స్పీడ్.. అనంత ప్లాంట్‌లో నేడే ‘సెల్టోస్’ ప్రొడక్షన్

అనంతపురం జిల్లాలో పరివేష్టితమైన కియా మోటార్స్ ఇక పరుగులు తీయనున్నది. గురువారం నుంచి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ప్రస్తుతానికి రోజుకు 280 కార్ల తయారీతో ప్రారంభించి మున్ముందు గంటకు 55 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో కియో మోటార్స్ ముందుకు సాగుతోంది. 
 

Kia Motors eyes global markets with made-in-India Seltos
Author
Hyderabad, First Published Aug 8, 2019, 10:47 AM IST

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ అనుబంధ సంస్థ ‘కియా కార్లు’ తెలుగు రాష్ట్రాల్లో పరుగు తీసేందుకు సిద్ధమయ్యాయి. దేశీయంగా తయారవుతున్న ఇవి భారతీయ రోడ్లపై త్వరలో సగర్వంగా తిరగనున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచేలా అనంతపురం జిల్లా పెనుకొండలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కియా మోటార్స్‌ పరిశ్రమలో మాస్‌ ప్రొడక్షన్‌ పేరిట కార్ల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. 

తొలుత సెల్టోస్‌ మోడల్‌ కారును ఉత్పత్తి చేస్తున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, కియా ప్రతినిధులు ఈ కారును విడుదల చేస్తారు.

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ కియా హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి-44కి ఆనుకుని అనంతపురం జిల్లాలోని ఎర్రమంచి వద్ద భూములను ఎంపిక చేసుకుని ప్లాంట్‌ నిర్మాణంచేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో 2017 ఏప్రిల్‌ 27వ తేదీన ఒప్పందం చేసుకుని అదే ఏడాది నవంబర్ నుంచి పనులను ప్రారంభించింది. 

ఈ ఏడాది జనవరి 29వ తేదీన ప్రయోగాత్మకంగా కార్ల ఉత్పత్తికి కియా మోటార్స్‌ శ్రీకారం చుట్టింది.  ఈ పరిశ్రమ కోసం కియా మోటార్స్ సంస్థ రూ.13,500 కోట్లను వెచ్చించింది. ఈ ప్లాంట్ ద్వారా 11వేల మందికి ఉపాధి దక్కనుంది. వీరిలో ప్రత్యక్షంగా 7వేల మంది ఉపాధి పొందుతారు. కియాకు అనుబంధంగా ఏర్పాటవుతున్న 20 పరిశ్రమల ద్వారా మరో రూ.3వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటిలో 4వేల మందికి ఉపాధి దక్కనుంది.

గత నెల నుంచి కియా ప్లాంటులో భారీ ఉత్పత్తి (మాస్‌ ప్రొడక్షన్‌) మొదలైంది. వాస్తవంగా ఇందులో గంటకు 55 కార్ల చొప్పున, ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా మొదలైన మాస్‌ ప్రొడక్షన్‌లో రోజుకు 280 కార్లు తయారవుతున్నాయి. ఈ నెలలో 8వేల కార్లను ఉత్పత్తి చేయనున్నారు. 

కియో ప్లాంటులోని బాడీ షాప్‌, పెయింట్‌ షాప్‌, అసెంబ్లింగ్‌ విభాగాల్లో 400 వరకు రోబోలు పని చేస్తున్నాయి. ఇప్పటికే కార్ల కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీన కియా యాజమాన్యం ‘సెల్టోస్’ మోడల్ కారు ధరను ప్రకటించనుంది. వచ్చేనెల నుంచి కార్ల డెలివరీ మొదలు కానుంది.

అంతేకాదు ప్రతి 6 నెలలకు ఓ కొత్త మోడల్‌ కారును కియో మోటార్స్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. మున్ముందు ఇదే ప్లాంటుకు సమీపంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios