కవాసకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉంటుందో చూసారా..?
ఈ ఎలక్ట్రిక్ బైక్స్ బ్యాక్ వీల్స్ చైన్ డ్రైవ్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తాయి. హార్డ్‌వేర్ విషయానికొస్తే ఈ రెండు విల్స్ కి డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు.
ఐరో స్పేస్ కంపెనీ కవాసకి రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ని EICMA 2022లో పరిచయం చేసింది. వీటిని కంపెనీ వచ్చే ఏడాదిలో లాంచ్ చేయనుంది. ఈ బైక్స్ జెడ్ అండ్ నింజా ఆధారంగా ఉంటాయి. యూరోపియన్ A1 వాహన లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగా ఈ బైక్స్ రూపొందించినట్లు కవాసకి తెలిపింది.
జెడ్ అండ్ నింజా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటికీ ప్రోటోటైప్ దశలోనే ఉన్నాయి. ఈ రెండు బైక్స్ కి సింగిల్ పవర్‌ట్రెయిన్‌ను ఉంటాయి. దీనికి 3kWh సామర్థ్యంతో డ్యూయల్ బ్యాటరీ అందించార. ఈ బైక్స్ పెట్రోల్‌తో నడిచే 125సీసీ బైక్స్ కి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఉత్పత్తి అండ్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.
ఈ ఎలక్ట్రిక్ బైక్స్ బ్యాక్ వీల్స్ చైన్ డ్రైవ్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తాయి. హార్డ్‌వేర్ విషయానికొస్తే ఈ రెండు విల్స్ కి డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు అండ్ వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటాయి. జెడ్ ఎలక్ట్రిక్ బైక్ కవాసకి Z250 నేక్డ్ స్ట్రీట్ బైక్ డిజైన్ లాంగ్వేజ్ పోలి ఉంటుంది.
నింజా ఎలక్ట్రిక్ బైక్ ఇతర నింజా బైక్స్ నుండి ప్రేరణ పొందుతుంది, అయితే సైజ్ తో పోల్చితే ఎలక్ట్రిక్ బైక్ నింజా 250కి దగ్గరగా కనిపిస్తుంది. అందువల్ల ముందు భాగంలో అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఫుల్ ఫెయిరింగ్, స్ప్లిట్ సీట్ సెటప్ అండ్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.