జస్టిస్ ఎన్‌వి రమణని సుప్రీం కోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన ఏప్రిల్ 24న  ప్రమాణ స్వీకరణం చేయనున్నారు. 

సుప్రీం కోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనికి ఆమోదం తెలుపుతూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ గా ఉన్న ఎస్‌ఐ బొబ్డే తరువాత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ పేరును సిఫారసు చేశారు.

ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సిజెఐ) ఎస్‌ఐ బొబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. అతని స్థానంలో జస్టిస్ ఎన్‌వి రమణ ఏప్రిల్ 24 న తదుపరి సిజెఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జస్టిస్ నూతలపటి వెంకట రమణ 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే ఎన్‌వి రమణ 26 ఆగస్టు 2022న పదవీ విరమణ చేయనున్నందున ఆయన ఈ పదవీలో రెండేళ్ల కన్నా తక్కువ కాలం పాటు కొనసాగనున్నారు.

also read మీ ఫోన్ పే, గూగుల్ పే నుండి డబ్బు కట్ అయ్యిందా..? అయితే ఈ విధంగా చేయండి.. ...

 జస్టిస్ ఎన్‌వి రమణ ఎవరు?
ఎన్‌వి రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలోని పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన 10 ఫిబ్రవరి 1983నుండి న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. రైతు కుటుంబానికి చెందిన జస్టిస్ ఎన్.వి.రమణ సైన్స్ అండ్ న్యాయవాదంలో పట్టభద్రులయ్యారు. 27 జూన్ 2000న అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
 27 జూన్ 2000 నుండి మే 2013 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. దీని తరువాత 2 సెప్టెంబర్ 2013న పదోన్నతి లభించింది దీంతో ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 
17 ఫిబ్రవరి 2014 న జస్టిస్ ఎన్‌వి రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎన్‌వి రమణ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులుగా అలాగే సిజెఐ ఎస్‌ఐ బొబ్డే తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు.