Asianet News TeluguAsianet News Telugu

జూన్ 30 లాస్ట్ డేట్.. క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఏంటంటే ?

ఈ నెల 30 తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ  భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్- BBPS ద్వారా ప్రాసెస్ చేయాలని RBI ఇప్పటికే ఆదేశించింది. సమాచారం ప్రకారం, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకులు ఇంకా BBPSని  ప్రారంభించలేదు.

June 30 is last date.. RBI shocked credit card holders.. What's the matter was?-sak
Author
First Published Jun 27, 2024, 8:51 AM IST

జూన్‌లో ఇంకా  కొద్దీ రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, జులై 1 నుంచి మాత్రం క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కాబట్టి బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.


ఈ నెలాఖరు (జూన్ 30, 2024) తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్-BBPS ద్వారా ప్రాసెస్ చేయాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే ఆదేశించింది. సమాచారం ప్రకారం, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకులు ఇంకా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(BBPS)ని  ప్రారంభించలేదు. అయితే, ఈ బ్యాంకులన్నీ కలిసి కస్టమర్లకు 5కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. ఇంకా సూచనలను పాటించని బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపనీలకు చెందిన క్రెడిట్ కార్డ్ బిల్లులను జూన్ 30 తర్వాత  చెల్లించలేరు.

June 30 is last date.. RBI shocked credit card holders.. What's the matter was?-sak

ఇప్పటికే BBPSలో మెంబర్స్ గా  ఉన్న PhonePe, Credi వంటి ఫిన్‌టెక్‌లు కూడా జూన్ 30లోపు RBI ఈ సూచనలను పాటించవలసి ఉంటుంది. అయితే, ఎకనామిక్ టైమ్స్‌ను నివేదిక ప్రకారం, పేమెంట్స్  డిపార్ట్మెంట్ చివరి తేదీ లేదా టైం లైన్ 90 రోజులు పొడిగించాలని కోరింది. ఇంకా BBPS కింద ఇప్పటివరకు 8 బ్యాంకులు మాత్రమే ఈ బిల్లు పేమెంట్  సర్వీస్ అమలు చేశాయి. మొత్తం 34 బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి ఆమోదించినప్పటికీ, వీటిలో 8 బ్యాంకులు మాత్రమే ప్రస్తుతం BBBSను అమలు చేశాయి.

June 30 is last date.. RBI shocked credit card holders.. What's the matter was?-sak

SBI కార్డ్, BOB (బ్యాంక్ ఆఫ్ బరోడా) కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి బ్యాంకులు  BBBSను అమలు చేశాయి. పేమెంట్ ట్రెండ్‌లలో బెటర్ విజిబిలిటీని అందించడం వల్ల క్రెడిట్ కార్డ్‌ల సెంట్రలైజ్డ్  పేమెంట్  కోసం RBI ఆదేశాలు జారీ చేసింది. ఇంకా  మోసపూరితమైన ట్రాన్సక్షన్స్  ట్రాక్ చేయడానికి, పరిష్కరించడానికి ఇది ఓక మెరుగైన మార్గాన్ని అందిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios