న్యూ ఢీల్లీ: భారత మార్కెట్లో గణనీయమైన డిమాండ్‌ వృద్ధిని కనబరిచిన జాన్సన్ బేబీ కొత్త బేబీ కేర్ ఉత్పత్తులను విడుదల చేసినట్లు తెలిపింది. కొత్త ఉత్పత్తులలో వాష్, లోషన్, క్రీమ్, ఆయిల్ ఉన్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, ఫస్ట్‌ క్రై, నైకా వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుందని జాన్సన్ బేబీ ఒక ప్రకటనలో తెలిపింది. 'కాటన్‌టచ్' ఉత్పత్తులు కొన్ని వారాల్లో రిటైల్ దుకాణాల్లో లభిస్తాయని కంపెనీ తెలిపింది.

"ఈ అపూర్వమైన కాలంలో ఈ ప్రత్యేకమైన లాంచ్ భారతదేశంలో నమ్మదగిన బేబీ కేర్ బ్రాండ్ల నుండి సైన్స్ ఆధారంగా సమర్థవంతమైన ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించెందుకు ఒక ప్రయత్నం" అని ఇది తెలిపింది.

also read ఆండ్రాయిడ్ యూజర్లు అలర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ వెంటనే డిలిట్ చేయండి.. ...

కాటన్‌టచ్ ఒక వినూత్నమైన శ్రేణి అని సహజమైన పత్తితో పిల్లల చర్మానికి చికాకు లేకుండా ఉండడానికి రూపొందించినా  బేబీ కేర్ ఉత్పత్తులలో ప్రపంచంలోనే మొదటిది అని కంపెనీ పేర్కొంది.

జాన్సన్ & జాన్సన్ కన్స్యూమర్ డివిజన్ ఇండియా విపి మార్కెటింగ్ మనోజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, "లాక్ డౌన్ దశలో కూడా భారతీయ మార్కెట్లో బేబీ కేర్ ఉత్పత్తుల కోసం డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్లు మేము చూశాము.

పిల్లల కోసం వారి తల్లితండ్రులు ఉత్పత్తులలో అత్యధిక భద్రత కోరడం వల్ల ఈ ఉత్పత్తిని ప్రారంభించడానికి మాకు స్ఫూర్తినిచ్చాయి. "ఇ-కామర్స్ మార్గం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది తల్లిదండ్రులకు మా ఉత్పత్తులు చేరాలని, వారు మరింత ఆనందంగా ఉండేందుకు సహాయపడాలని మేము ఆశిస్తున్నాము." అని తెలిపింది.