Bharat GPT : చాట్ జీపీటీకి పోటీగా ‘భారత్ జీపీటీ’

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబేతో కలిసి 'భారత్ GPT' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

Jio working on 'Bharat GPT' with IIT-B; to launch OS for televisions: Akash Ambani ksp

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబేతో కలిసి 'భారత్ GPT' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన జియో ..టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు "సమగ్రంగా ఆలోచిస్తోంది’’ అని ఆకాష్ వెల్లడించారు. ఐఐటీ బాంబే వార్షిక టెక్‌ఫెస్ట్‌లో మాట్లాడుతూ.. కంపెనీకి ఎకోసిస్టమ్ ఆఫ్ డెవలప్‌మెంట్‌ని నిర్మించడం చాలా ముఖ్యమైనదని, జియో 2.0 విజన్‌పై ఇప్పటికే పని జరుగుతోందని తెలిపారు. 

2014 నాటి జియో , ప్రీమియర్ టెక్ స్కూల్ మధ్య భాగస్వామ్యం గురించి ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. భారత్ జీపీటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు తాము ఐఐటీ బాంబేతో కలిసి ఒక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులు ఏఐదేనని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు, సేవలు ప్రతి ఏరియాలోనూ మార్పులు తీసుకొస్తాయని అంబానీ చెప్పారు. మా సంస్థలోనై ఏఐని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీడియా, స్పేస్, వాణిజ్యం, కమ్యూనికేషన్, పరికరాలలో కంపెనీ ఉత్పత్తులు సేవలను ప్రారంభించనుందని ఆకాష్ అంబానీ తెలిపారు. టీవీల కోసం సొంత ఓఎస్‌ను తెచ్చేందుకు పనిచేస్తున్నామని.. దానిని ఎలా ప్రారంభించాలనే దానిపై సమగ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

Jio working on 'Bharat GPT' with IIT-B; to launch OS for televisions: Akash Ambani ksp

 

అంబానీ కుటుంబానికి 2024 ప్రత్యేక సంవత్సరమని, ఈ ఏడాది తన సోదరుడు వివాహం చేసుకోబోతున్నాడని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. 5జీ నెట్‌వర్క్‌లను అందించడం పట్ల కంపెనీ చాలా ఎగ్జయిటింగ్‌గా వుందని, ఎలాంటి సంస్థకైనా 5జీ స్టాక్‌ను అందిస్తామని అంబానీ చెప్పారు. రాబోయే దశాబ్ధంలో భారత్‌ అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా నిలుస్తుందని, దశాబ్ధం చివరినాటికి దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఏఐ వినియోగం గురించి చెబుతూ.. తన బావ నిన్న బెడ్ టెంపరేచర్ నియంత్రించడానికి ఏఐ యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించాడని తెలిపారు. 

జియో ప్రస్తుతం కంపెనీ అనుసరిస్తున్నది భారతదేశానికి మంచిదనే నమ్మకంతో పనిచేస్తుందని , డబ్బును దేశానికి అందించిన సేవ ఉప ఉత్పత్తిగా ఆకాష్ అంబానీ అభివర్ణించారు. జియోను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌గా అభివర్ణించిన అంబానీ, యువ పారిశ్రామికవేత్తలు విఫలమవుతారని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొత్త వ్యవస్థాపకులు సమాజ హితం కోసం పనిచేయాలని , చేసే పని పట్ల మక్కువ కలిగి వుండాలని ఆయన కోరారు. టెక్నాలజీ అనేది గొప్ప ఈక్వలైజర్ అని.. ఇది జనం, కులాల సరిహద్దులను అధిగమించిందన్నారు. జియో ఎప్పుడూ భవిష్యత్ సాంకేతికతపై ఓ కన్నేసి వుంచుతుందని ఆకాష్ అంబానీ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios